TET 2022: బీఈడీ వాళ్లు బ్రిడ్జి కోర్సు చేయాల్సిందే, టెట్ రూల్స్ వెల్లడించిన తెలంగాణ విద్యాశాఖ
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కూడా విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే టెట్ వేయబోతున్నట్టు సిగ్నల్ ఇచ్చింది.
ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టెట్ నిర్వహించేందుకు పాఠశాళ విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది.
బీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీ రాయాలంటే నూతన విద్యావిధానం ప్రకారం టెట్ పాసై ఉండాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో పాసైన వాళ్లు మాత్రమే డీఎస్ రాసేందుకు అర్హులు. ఒకప్పుడు ఈ టెట్ ఏడేళ్ల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. అంటే ఒకసారి టెట్‌లో పాసైన వాళ్లు ఏడేళ్ల వరకు మళ్లీ డీఎస్సీలు రాసుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలోనే ఈ నిబంధనను కేంద్రం మార్చేసింది. ఇప్పుడు ఒకసారి టెట్ పాసైన వాళ్లు ఎప్పుడైనా డీఎస్సీలు రాసుకోవచ్చు.
#TSTET#TSTETValidity#TelanganaTET pic.twitter.com/Rzq4FVDG3W
— Teachersbadi.In (@teachersbadi) March 23, 2022
కేంద్రం సూచిన నిబంధనల మేరకు తెలంగాణ విద్యాశాఖ టెట్‌కు సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది. టెట్ అర్హతల్లో మార్పులు చేసింది. టెట్ లోని రెండో పేపర్ రాసేందుకు బీఈడీ చేసిన వాళ్లు కూడా అర్హులేనని వెల్లడించింది. వాళ్లు ఒక వేళ ఎస్జీటీ ఉద్యోగం సాధిస్తే ప్రాథమిక విద్యలో ఆరునెలల్లో బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
GOVERNMENT OF TELANGANA ABSTRACT School Education - Guidelines for conducting Telangana State Teacher Eligibility Test (TS TET) under the Right of Children to Free and Compulsory Education Act (RTE) 2009- Amendment - Orders -Issued. pic.twitter.com/J6O9cv8hjc
— TS_AP STATE DISASTER RESPONSE & FIRE SERVICES. (@tsap_dept) March 23, 2022
తెలంగాణలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ ఉపాధ్యాయ ఉద్యోగాలను కూడా ఫిల్ చేస్తున్నట్టు చెప్పారు. సుమారు 13వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు తీయబోతున్నామన్నారు. అందుకే ఆ ఉద్యోగాల భర్తీ కాక ముందే టెట్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఒకట్రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
ఈ సన్నాహంలో భాగంగానే టెట్‌కు ఎవరు అర్హులో ఈ మధ్య వచ్చిన మార్పులతో ఉన్న కన్ఫ్యూజ్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేసింది విద్యాశాఖ.