అన్వేషించండి

TSDSC Application: తెలంగాణ డీఎస్సీ-2024 దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?

తెలంగాణలో టెట్ -2024 నోటిఫికేషన్ వెలువడటంతో.. డీఎస్సీ-2024 దరఖాస్తు గడువును విద్యాశాఖ ఏప్రిల్ 2 నుంచి జూన్ 20కి మార్చింది.

TS DSC Application: తెలంగాణ ప్రభుత్వం తాజాగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా..  ఏప్రిల్‌ 2 వరకు ఫీజు చెల్లింపు, ఏప్రిల్ 3తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుందని విద్యాశాఖ నోటిఫికేషన్ సమయంలో పేర్కొంది. అయితే తాజాగా టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగించింది. మరోవైపు TS TET - 2024 నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మార్చి 14న విడుదల చేసింది. టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటల్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.

మే 20 నుంచి టెట్, జులై 17 నంచి డీఎస్సీ పరీక్షలు...
అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు డీఎస్సీ (TS DSC)-2024 పరీక్ష తేదీaలను కూడా విద్యాశాఖ ఖరారుచేసింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. టెట్ నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 2 నుంచి జూన్ 20 వరకు పొడిగించారు. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 లాంగ్వేజ్ పండిట్, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో.. కనీసం 10 రోజులపాటు పరీక్షలు జరుగనున్నాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, డగఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

సందేహాల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్‌..
డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Thangalaan : విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
“ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
Embed widget