అన్వేషించండి

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీపై కీలక మార్పు జరిగింది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది.

TS Constable Exam : తెలంగాణలో కానిస్టేబుల్‌ రాత పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 21వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్‌ రాత పరీక్షను ఆగస్టు 28న నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రకటించింది. సాంకేతిక కారణాలతో రాత పరీక్ష తేదీని మార్చినట్టు బోర్డు తెలిపింది. రాష్ట్రంలో 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల అయింది. మరో 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 28వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అయింది. అయితే కానిస్టేబుల్‌ పోస్టులకు 6.50 లక్షల మంది అప్లై చేసుకున్నారని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 

15 వేల పోస్టులకు నోటిఫికేషన్ 

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఆగస్ట్ 21న జరగాల్సిన పరీక్ష వారం రోజులు వాయిదా పడింది.  తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్లు ఇచ్చింది. 

ఆగస్టు 18న హాల్ టికెట్లు 

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. రాత పరీక్షకు ఆగస్టు 18న హాల్ టికెట్లు విడుదల చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 18 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు ఇప్పటికే ప్రకటించింది. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్, మెకానిక్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 

6.50 లక్షల మంది హాజరయ్యే అవకాశం 

కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది హాజరవుతారని బోర్డు అంచనా వేస్తుంది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధిస్తారు. అయితే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ భావిస్తుంది.

కానిస్టేబుల్ ఉద్యోగుల పే స్కేల్

  • పోలీస్ కానిస్టేబుల్(సివిల్) -       రూ. 24280- రూ.72850   - ఖాళీలు 4965 
  • పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) -       రూ.24280-రూ.72850                       - ఖాళీలు 4423 
  • పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్)(పురుషులు) - రూ.24280-72850    - ఖాళీలు 100 
  • పోలీస్ కానిస్టేబుల్ (టీఎస్ఎస్పీ)(పురుషులు) - రూ.24280-72850 - ఖాళీలు 5010 
  • పోలీస్ కానిస్టేబుల్ (తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) - రూ.24280-72850 - ఖాళీలు 390 
  • స్టేట్ డిజాస్టర్ రెస్ఫాన్స్ & ఫైర్ సర్వీస్ లో  ఫైర్ మెన్ - రూ.24280-72850 - ఖాళీలు 610 
  • జైలు, ఇతర సర్వీసుల్లో (వార్డర్) (పురుషులు)- రూ.24280-72850 -ఖాళీలు 136 
  • జైలు, ఇతర సర్వీసుల్లో (వార్డర్) (స్త్రీలు)- రూ.24280-72850 - ఖాళీలు 10
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget