Free Job Training: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, టెక్ మహీంద్ర ఫౌండేషన్ ప్రకటన!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. టెక్ మహీంద్ర ఫౌండేషన్, HCHW సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. టెక్ మహీంద్ర ఫౌండేషన్, HCHW సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి కంప్యూటర్ శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించునున్నట్లు మేనేజర్ గౌస్ పాషా మార్చి 2న ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి, వయసు 18-27 మధ్య వారు ఉచిత శిక్షణకు అర్హులు.
శిక్షణలో భాగంగా కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్-ఆఫీస్ 2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంగ్లిష్ టైపింగ్, కమ్యూనికేటివ్, ఇంటర్వ్యూ స్కిల్స్.. బీకాం ఉత్తీర్ణులకు టాలీ ప్రైమ్, బేసిక్ అక్కౌంట్స్, అడ్వాన్స్‌డ్ ఎంఎస్-ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తారు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు మార్చి 15లోపు సంబంధిత ఫోన్ నంబర్లు:7674985461, 7093552020 ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ
అర్హత: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
కోర్సుల వివరాలు...
1) కంప్యూటర్ బేసిక్స్
2) ఎంఎస్-ఆఫీస్ 2010
3) స్పోకెన్ ఇంగ్లిష్
4) ఇంటర్నెట్ కాన్సెప్ట్స్
5) ఇంగ్లిష్ టైపింగ్
6) కమ్యూనికేటివ్
7) ఇంటర్వ్యూ స్కిల్స్
8) బీకాం ఉత్తీర్ణులకు టాలీ ప్రైమ్, బేసిక్ అక్కౌంట్స్, అడ్వాన్స్‌డ్ ఎంఎస్-ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్.
నమోదుచేసుకోవడానికి చివరితేది: 15.03.2023.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 7674985461, 7093552020 .
Also Read:
సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌పై మూడు నెలల ఉచిత శిక్షణ:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గ్రీన్ జాబ్' కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌పై మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయినవారికి ఆపై ఉపాధి అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మేనేజర్ రాఘవేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచిత శిక్షణపై ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు ఐటీఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు మార్చి 15 లోపు తమ పేర్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధింత ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
వివరాలు...
* ఉచిత శిక్షణ
అంశం: సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్.
అర్హత: ఐటీఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో. ఫోన్ నెంబరు ద్వారా సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 99641 31921, 80190 50334.
Also Read:
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..