Supreme Court of India: సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా ఉన్నాయి
SCI Vacancies: సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా(SCI) ఖాళీగా ఉన్న 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

SCI Recruitment: ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా(SCI) ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 241 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్‌తో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 08 వరకు దరఖాస్తులు పమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 241
జూనియర్ కోర్టు అసిస్టెంట్(గ్రూప్-బి నాన్ గెజిటెడ్): 241 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి. ఇంగ్లీష్‌లో నిమిషానికి కనీసం 35 పదాలు టైప్ చేయగలగాలి. వీటితో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 08.03.2025 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ , ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ
పరీక్షా విధానం:
➽ ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నాపత్రం ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. (కాంప్రహెన్షన్‌తో సహా జనరల్ ఇంగ్లీష్- 50 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్- 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్- 25 ప్రశ్నలు) అడుగుతారు. సమయం: 2 గంటలు.
➽ ఆబ్జెక్టివ్ టైప్ C నాలెడ్జ్ టెస్ట్ (25 ప్రశ్నలు)
➽ కంప్యూటర్‌లో ఇంగ్లీష్ టైపింగ్ పరీక్ష కనీస వేగంతో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి(టైప్ చేయవలసిన మొత్తం పదాలలో 3% వరకు తప్పులు అనుమతించబడతాయి). సమయం: 10 నిమిషాలు.
➽ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. ఇందులో కాంప్రహెన్షన్ పాసేజ్, ప్రెసిస్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ ఉంటుంది. సమయం: 2 గంటలు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో 128 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అవి.. బీహార్(అర్రా, ఔరంగాబాద్, భాగల్పూర్, దర్భంగా, గయా, ముజఫర్‌పూర్, పాట్నా, పూర్నియా); ఒడిశా(బాలాసోర్, బెర్హంపూర్- గంజాం, భువనేశ్వర్, కటక్, సంబల్పూర్); జార్ఖండ్(బొకారో స్టీల్ సిటీ, ధన్‌బాద్, హజారీబాగ్, జంషెడ్‌పూర్, రాంచీ); అరుణాచల్ ప్రదేశ్(నహర్లగన్); అస్సాం(దిబ్రూగర్, గౌహతి, జోర్హాట్, సిల్చార్); మణిపూర్(ఇంఫాల్); మేఘాలయ(షిల్లాంగ్); మిజోరం (ఐజ్వాల్); త్రిపుర (అగర్తల); వెస్ట్ బెంగాల్ (అసన్సోల్, బుర్ద్వాన్, దుర్గాపూర్, కోల్‌కతా, సిలిగురి); ఢిల్లీ/ఎన్‌సీఆర్ (ఢిల్లీ/ఎన్‌సీఆర్); ఉత్తరప్రదేశ్ (మీరట్, ఆగ్రా, అలీఘర్, బరేలీ, గోరఖ్‌పూర్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, మొరాదాబాద్, ముజఫర్‌నగర్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, డెహ్రాడూన్, హల్ద్వానీ, రూర్కీ); రాజస్థాన్ (అజ్మీర్, అల్వార్, బికనీర్, జైపూర్, జోధ్‌పూర్, కోట, సికర్, ఉదయపూర్); హర్యానా(అంబాల, కురుక్షేత్ర); హిమాచల్ ప్రదేశ్ (బడ్డీ బిలాస్‌పూర్, హమీర్‌పూర్, సిమ్లా, జమ్ము); జమ్మూ కాశ్మీర్(శ్రీనగర్); పంజాబ్ (అమృతసర్, బటిండా, జలంధర్, లూథియానా, మొహాలి, పాటియాలా); ఆంధ్రప్రదేశ్ (అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం); కర్ణాటక (బెళగావి (బెల్గాం), బెంగళూరు, హుబ్బల్లి (హుబ్లీ), కలబురగి (గుల్బర్గా), మంగళూరు (మంగళూరు), మైసూరు (మైసూరు), శివమొగ్గ (షిమోగా)); తెలంగాణ (హైదరాబాద్, కరీంనగర్, వరంగల్); కేరళ (ఎర్నాకులం కన్నూర్, కొల్లం, కొట్టాయం, కోజికోడ్, తిరువనంతపురం, త్రిస్సూర్) పుదుచ్చేరి (పుదుచ్చేరి); తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్, మధుర, ఐసేలం, వెల్లూరు,తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, కన్యాకుమారి/నాగర్‌కోయిల్); గుజరాత్ (అహ్మదాబాద్, గాంధీనగర్, మెహసానా, రాజ్‌కోట్, సూరత్, వడోదర); మహారాష్ట్ర (అహ్మద్‌నగర్, అమరావతి, ఛత్రపతి శంభాజీ నగర్ జల్గావ్, కొల్హాపూర్, ముంబై, నాగ్‌పూర్ నాసిక్, నవీ ముంబై, పూణే); ఛత్తీస్‌గఢ్ (భిలాయ్ నగర్, బిలాస్‌పూర్ CG, రాయ్‌పూర్); మధ్యప్రదేశ్ (భోపాల్, గ్వాలియర్, ఇండోర్, జబల్పు ఉజ్జయిని).
జీతం: నెలకు రూ.35,400.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.02.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.03.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

