అన్వేషించండి

SSC CPO Notification: 4187 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF- విభాగాల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 4న విడుదల చేసింది.

Delhi Police and Central Armed Police Forces Examination, 2024: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF- (బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) విభాగాల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 5న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 28 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులకు మే 9, 10, 13 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపికైనవారిని ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల్లో భర్తీచేస్తారు. 

వివరాలు..

* ఢిల్లీపోలీసు, సీఏపీఎస్ ఎస్‌ఐ ఎగ్జామినేషన్-2024

ఖాళీల సంఖ్య: 4,187.

1) సీఏపీఎఫ్ - సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ): 4,001 పోస్టులు

2) ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు: 125 పోస్టులు

3) ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- మహిళలు: 61 పోస్టులు

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.08.2024 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: సీబీటీ రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం.

జీతభత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400 ఇస్తారు. ఇతర భత్యాలు అదనం.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 28.03.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 28.03.2024.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 30.03.2024 నుంచి 31.03.2024 వరకు.

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: మే 9, 10, 13 తేదీల్లో.

Notification

Online Application

Website

ALSO READ:

ఏఐఏఎస్‌ఎల్, విశాఖపట్నంలో 77 ఉద్యోగాలు, వివరాలు ఇలా
విశాఖపట్నంలోని ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ - కస్టమర్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్/హ్యాండీ వుమెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్, డిగ్రి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లీషు మాట్లాడటం, రాయటం వచ్చి ఉండాలి. సరైన అర్హతలు ఉన్నవారు పోస్టులని అనుసరించి మార్చి 9, 11వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 0900 నుంచి 1200 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు. పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget