అన్వేషించండి

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ రాతపరీక్ష ఫైనల్ 'కీ' విడుదల

unior Engineer Answer Key: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో జూనియర్‌ ఇంజినీర్‌ నియామకాలకు సంబంధించి రాత పరీక్ష(పేపర్‌-1) తుది కీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది.

Junior Engineer Answer Key: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) 1,324 జూనియర్‌ ఇంజినీర్‌ నియామకాలకు సంబంధించి రాత పరీక్ష(పేపర్‌-1) తుది కీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలు అక్టోబర్‌ 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ సాయంతో ప్రశ్నపత్రం, కీలను డిసెంబర్‌ 13వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేపర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), పేపర్‌-2 (ఆఫ్‌లైన్‌ డిస్క్రిప్టివ్‌)రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది.   

జేఈ పేపర్-1 ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో  జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్-1 రాతపరీక్ష ఫైనల్ ఆన్సర్ 'కీ'ని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల నవంబరు 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ సాయంతో ప్రశ్నపత్రం, కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబరు 13 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పేపర్-2 (డిస్క్రిప్టివ్‌) పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుదిఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. 

జేఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 9 నుంచి 11 వరకు పేపర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని అక్టోబరు 13న ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను అక్టోబర్‌ 13న సాయంత్రం 5 గంటల నుంచి అక్టోబర్‌ 15 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఫైనల్ కీని విడుదల చేశారు. త్వరలోనే పేపర్-1 ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

పేపర్-2 విషయానికొస్తే.. 
మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.

జేఈ పోస్టుల నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC Job Notifications: ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget