News
News
వీడియోలు ఆటలు
X

SSC Exams: అక్టోబరులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలివే! ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబర్‌లో నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఖరారు చేసింది.

FOLLOW US: 
Share:

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబర్‌లో నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఖరారు చేసింది. ఈ మేరకు మే 17న ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌) ఎగ్జామినేషన్ (పేపర్‌ 1)-2023, స్టెనో గ్రేడ్‌-సి & డి ఎగ్జామ్‌-2023, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ & సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామ్‌-2023లను అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Also Read:

యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ - 2024 విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్-2024ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్షల వివరాలను చూసుకోవచ్చు. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది(2024) మే 26న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 2 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష ద్వారానే నిర్వహించనున్నారు. ఇక ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 2024, సెప్టెంబరు 20 నుంచి 5 రోజులపాటు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..

సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన  అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులు, వివరాలు ఇలా!
జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ జూనియర్ ఓవర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా/ డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్‌ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు  మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 19 May 2023 07:45 AM (IST) Tags: SSC Exams SSC Exam Calender Staff Selection Commission Exam Dates Staff Selection Commission Rescruitment Exams SSC October Exams

సంబంధిత కథనాలు

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!