Singareni Jobs: సింగరేణిలో 260 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఖాళీల భర్తీ ఇలా!
సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్నర్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఇంటర్నర్ రిక్రూట్‌మెంట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అంటే సంస్థలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులతోనే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3 నుంచి 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అలాగే దరఖాస్తు హార్డ్‌కాపీలకు, అవసరమైన అన్ని డాక్యమెంట్లు జతచేసి వారివారి విభాగాల అధిపతులకు మార్చి 16లోగా సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* సింగరేణిలో ఉద్యోగాలు (ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్)
ఖాళీల సంఖ్య: 260
1) ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 61
➥ అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ &ఎం): 24
➥ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 04
➥ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ: 11
➥ ప్రోగ్రామర్ ట్రైనీ: 04
➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ &ఎం): 14
➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 04
2) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 199
➥ జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్: 20
➥ ఫిట్టర్ ట్రైనీ: 114
➥ ఎలక్ట్రీషియన్ ట్రైనీ: 22
➥ వెల్డర్ ట్రైనీ: 43
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి వర్తించదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్షకు 85 మార్కులు, అసెస్‌మెంట్ రిపోర్టుకు 15 మార్కులు మదింపు ఉంటుంది.
దీని ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.03.2023.
➥ యూనిట్ స్థాయిలో దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 16.03.2023.
➥ జీఎం ఆఫీస్ ద్వారా దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 20.03.2023.
➥ కార్పొరేట్ ఆఫీసుకు దరఖాస్తు హార్డ్‌కాపీలు చేరడానికి చివరితేది: 25.03.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
* ఎగ్జిక్యూటివ్ పోస్టులకు:
Director(PA & W)
Kothagudem.
* నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు:
General Manager(Personnel) Welfare & RC.
Kothagudem.
Online Application (Executive)
Also Read:
డీఆర్‌డీవో-జీఆర్‌టీఈలో 150 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
బెంగళూరులోని డీఆర్‌డీవో- గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ జారీచేసింది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 16 వరకు తమ దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..