అన్వేషించండి

SPP Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌ - హైదరాబాద్‌లో 96 సూపర్‌వైజర్, టెక్నీషియన్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్ పోస్టులను భర్తీచేయనున్నారు.

Security Printing Press, Hyderabad Notification: మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

ఖాళీల వివరాలు..

ఖాళీల సంఖ్య: 96 పోస్టులు

పోస్టుల కేటాయింపు: యూఆర్-50, ఈడబ్ల్యూఎస్-08, ఎస్సీ-09, ఎస్టీ-06, ఓబీసీ-23.

విభాగాలు: ప్రింటింగ్/ కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్ మేనేజ్‌మెంట్.

➥ సూపర్‌వైజర్ (టీవో- ప్రింటింగ్): 02 పోస్టులు
అర్హత: ప్రథమ శ్రేణిలో డిప్లొమా (ప్రింటింగ్ టెక్నాలజీ) లేదా బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్(ప్రింటింగ్ టెక్నాలజీ).

➥ సూపర్‌వైజర్ (టెక్- కంట్రోల్): 05 పోస్టులు
అర్హత: ప్రథమ శ్రేణిలో డిప్లొమా (ప్రింటింగ్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ) లేదా బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (ప్రింటింగ్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ).

➥ సూపర్‌వైజర్ (ఓఎల్‌): 01 పోస్టు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). డిగ్రీస్థాయిలో (హిందీ/ఇంగ్లిష్) ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ/ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ తెలిసి ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.  

➥ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 40 ఇంగ్లిష్, 40 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి లేదా డిప్లొమా (ప్రింటింగ్ టెక్నాలజీ) ఉండాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ (ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్) కలిగి ఉండాలి.

➥ ఫైర్‌మ్యాన్: 01 పోస్టు
అర్హత: పదోతరగతి అర్హతతోపాటు, ఫైర్‌మ్యాన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. నిర్ణీత ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి (15.04.2024 నాటికి)..

➥ సూపర్‌వైజర్/ సూపర్‌వైజర్ (టెక్నికల్ కంట్రోల్) పోస్టులకు 18- 30 సంవత్సరాలు; 

➥ జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్), జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్), జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్), జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులకు 18- 25 సంవత్సరాలు; 

➥ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 6-8 సంవత్సరాల వరకు; వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, ఒంటరి మహిళలకు 35 - 40 సంవత్సరాల వరకు; డిఫెన్స్ అభ్యర్థులకు 3 - 8 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి ఉండదు.

దరఖాస్తు రుసుము: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ముఖ్య తేదీలు....

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.03.2024.

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 15.04.2024. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024. (23:59 hrs)

➥ పరీక్ష తేదీ: మే/ జూన్-2024.

Notification

Online Application

Website

SPP Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌ - హైదరాబాద్‌లో 96 సూపర్‌వైజర్, టెక్నీషియన్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Ravi Teja: రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
Eluru Railway Station: ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
Embed widget