అన్వేషించండి

SBI PO Final Results: ఎస్‌బీఐ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

SBI PO Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి సంబంధించిన తుదిఫలితాలు మార్చి 19న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

SBI PO 2023 Final Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి సంబంధించిన తుదిఫలితాలు మార్చి 19న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఎస్‌బీఐ పీవో మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 16 నుంచి గ్రూప్ డిస్కషన్, జనవరి 21 నుంచి నిర్వహించిన ఇంటర్వ్యూలలో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.41,960 (బేసిక్ పే) జీతంగా ఇస్తారు.

SBI PO Fnal Results చూసుకోండిలా..

➥ అభ్యర్థులు ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. -sbi.co.in 

➥ అక్కడ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.

➥ అక్కడ కనిపించే 'SBI PO Final Results 2023' లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాల జాబితా ఓపెన్ అవుతుంది.

➥  స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి. అభ్యర్థులు తమ రూల్ నెంబరు ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు.

➥ భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల పేజీని డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

SBI PO Final Results కోసం క్లిక్ చేయండి..

భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభం కాగా.. దరఖాస్తు గడువును అక్టోబరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు నవంబరు 1, 4, 6 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను నవంబరు 21 విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 5, 16 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలు జనవరి 11న విడుదలయ్యాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఫేజ్-3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ జనవరి 11 ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా వీటి ఫలితాలను విడుదల చేశారు. 

సైకోమెట్రిక్ టెస్ట్: అభ్యర్థుల పర్సనాలిటి ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. మొతం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.
SBI PO Mains Results: ఎస్‌బీఐ పీవో మెయిన్స్‌-2023 ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

తుది ఎంపిక ఇలా:
మొత్తం 300 మార్కులకు తుది ఎంపిక కోసం నిర్ణయించారు. ఇందులో అభ్యర్థులు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు; గ్రూప్ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్‌కు 250 మార్కుల, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థుల నార్మలైజ్డ్ మార్కులను మెయిన్ పరీక్షకు 75గా, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులుగా నిర్ణయించారు.
SBI PO Mains Results: ఎస్‌బీఐ పీవో మెయిన్స్‌-2023 ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget