అన్వేషించండి

RRB NTPC CBAT 2022: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి

అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో జులై 30న రెండోదశ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ

ఇండియన్ రైల్వేలో 35,208 ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టుల భర్తీకి కోసం నిర్వహించనున్న  ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రెండో దశ ఆన్‌లైన్ పరీక్ష(CBAT-2)కు సంబంధించిన అడ్మిట్ కార్డులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

మొదటిదశ(CBAT-1) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 30న ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఆన్‌లైన్ పరీక్ష(CBAT-2) నిర్వహించనున్నారు.

అభ్యర్థులు కింది లింక్ ద్వారా తమ పరీక్ష అడ్మిట్ కార్డులను పొందవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Download RRB NTPC Admit Card

ఆన్‌లైన్ పరీక్ష అడ్మిట్‌కార్డులతోపాటు అభ్యర్థుల పరీక్ష రాసే నగరానికి సంబంధించిన ఇంటిమేషన్ స్లిప్‌లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది.  

అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Step 1. అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లాగిన్ అవ్వాలి.

Step 2. అక్కడ హోంపేజీలో 'Click here to login to view and download your E-Call letter for CBAT, Exam City and Date Intimation Slip' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Step 3. క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ విండోలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేయాలి.

Step 4.  వివరాలు నమోదుచేసి Login బటన్‌పై క్లిక్ చేయగానే RRB NTPC Admit Card కనిపిస్తోంది.

Step 5. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్ష సమయంలో అడ్మిట్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

RRB NTPC NTPC CBT 2 Exam- పరీక్ష విధానం:
ఎన్‌టీపీసీ పరీక్ష రాయడానికి అభ్యర్థులకు 90 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తంగా 120 ప్రశ్నలు ఉంటాయి. అందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50, గణితం నుండి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుండి 35 ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. దివ్యాంగులకు పరీక్ష రాయడానికి 120 నిమిషాల సమయం కేటాయించనున్నారు. దివ్యాంగ అభ్యర్థుల తరఫున వారి వెంట వచ్చిన వ్యక్తి పరీక్ష రాయవచ్చు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్‌తో ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.

అర్హత మార్కులు
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో కనీస మార్కుల శాతం సాధించాల్సి ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు, ఎస్సీ అభ్యర్థులు 30 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Kamareddy Crime News: భార్యను వేధిస్తున్న పార్టీ నేత అనుచరుడు.. చెప్పుతో కొట్టుకుంటూ పీఎస్‌కు తీసుకెళ్లిన భర్త
భార్యను వేధిస్తున్న పార్టీ నేత అనుచరుడు.. చెప్పుతో కొట్టుకుంటూ పీఎస్‌కు తీసుకెళ్లిన భర్త
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Embed widget