RRB Group D: ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
రైల్వేలో లెవల్-1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు.
RRB Group D Admit Card: రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఫేజ్-2 రాతపరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రైల్వే నియామక బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 8 వరకు పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ (పుట్టినతేది) వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల పరీక్ష తేదీకి నాలుగురోజుల ముందు నుంచి మాత్రమే అడ్మిట్ కార్డులను రైల్వేబోర్డు వెబ్‌సైట్‌లో పెడుతూ వస్తుంది.
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో లెవల్-1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాల కోసం దాదాపు కోటిన్నర మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అభ్యర్థుల తమ పరిధిలోని రైల్వే జోన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాల్లో మాత్రం ఒరిజినల్ గుర్తింపు పత్రాలను చూపించాలి. జిరాక్సు కాపీలను అనుమతించరు. ఇక ఎస్సీ, ఎస్టీలకు రైల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుంది.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
* మొదట www.indianrailways.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* తర్వాత మెనూ బార్‌లో కనిపించే 'Recruitment' బటన్‌పై క్లిక్ చేయాలి.
* క్లిక్ చేయగానే ఆర్ఆర్‌బీ పరిధిలోని ఉన్న అన్ని జోన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు దర్శనమిస్తాయి.
* అభ్యర్థి తనకు సంబంధించిన బోర్డు వెబ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ 'Click here to Download E-Call Letter, Exam City and Date advice and SC/ST travel authority'తో కూడిన టెక్ట్స్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* క్లిక్ చేయగానే వచ్చే 'CANDIDATE LOGIN' ఫామ్‌లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ నమోదుచేసి 'Login’ బటన్‌పై క్లిక్ చేయగానే 'అడ్మిట్ కార్డు' దర్శనమిస్తుంది.
* అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోవాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
పరీక్ష విధానం:
అర్హులైన అభ్యర్థులకు మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో తెలియపరుస్తారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీలు, పరీక్ష సమయం వంటి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల వ్యక్తిగత ఈమెయిల్‌కి కూడా ఈ వివరాలు చేరవేస్తారు.
✪ మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ (సీబీటీ) పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
✪ పరీక్ష సమయాన్ని దివ్యాంగులకు 120 నిమిషాలు, ఇతరులకు 90 నిమిషాలుగా నిర్ణయించారు.
✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
✪ అర్హత మార్కులను జనరల్-40%, ఈడబ్ల్యూఎస్-40%, ఓబీసీ-30%, ఎస్సీ-30%, ఎస్టీ-30% గా నిర్ణయించారు.
✪ దివ్యాంగులకు అదనంగా 2% మినహాయింపునిచ్చారు.
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...