RPF Constable Result 2025: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాలు 2025 విడుదల- అర్హత సాధించిన 42143 మంది అభ్యర్థులు
RPF Constable Result 2025: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాలు 2025 విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 42143 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

RPF Constable Result 2025: ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. ఈ పరీక్షలో 42,14 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలతోపాటు కటాఫ్ వివరాలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇప్పుడు ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక దారుఢ్యపరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత మెడికల్ టెస్టులు కూడా చేపడతారు. ఇవి ఎప్పుడెప్పుడు ఉంటాయో త్వరలోనే వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు.
ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాలు ఎక్కడ చూడాలి? ఎలా చూడాలి?
CEN RPF-02/2024(Constable) పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్ ఫలితాలను ఇవాళ(June 19) 2025 విడుదల చేసింది. ప్రాథమిక ఫలితాల్లో 42143 అభ్యర్థులు పీఈటీ, పీఎంటీ దశలకు అర్హత సాధించినట్టు ఆర్‌ఆర్‌బీ పేర్కొంది. ఈ ఫలితాలతోపాటు ఎవరికి కటాఫ్ ఎంత వరకు వచ్చాయో కూడా స్పష్టంకా వివరించారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి rrbcdg.gov.inవెబ్‌సైట్‌లో పెట్టారు. అందులో నుంచి పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసి మీ పేరు లేదా మీ రోల్ నెంబర్ ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు. ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది.
ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్లకు తర్వాత దశ పరీక్షలు పిలుస్తారు. దాన్ని ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ అంటారు. లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని కూడా అంటారు. అనంతరం డాక్యుమంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవి ఎప్పుడు ఉంటాయో వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలియజేస్తారు. దీనికి సంబంధించిన స్కోర్ కార్డులను(When scorecard will be released?) రేపు అంటే జూన్ 20న విడుదల చేస్తారు. ఇవాళ విడుదలై ఫలితాలకు సంబంధించిన పరీక్షను మార్చి రెండో తేదీ నుంచి 18 వరకు నిర్వహించారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?(How to Check RPF Constable Result?)
ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాలు2025ను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ ఫలితాలను చూడటానికి ఈ కింది సూచించిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.inలోకి వెళ్లండి.
- rrbcdg.gov.inలో ఉన్న రిజల్ట్ పేజ్‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్‌ను మీకు ఇక్కడ ఇస్తున్నాం.
- అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత హోంపేజ్‌లో CEN RPF 02/2024 (Constable) అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో CBT Result & Cut Off Scores’ అని ఉంటుంది. వాటిపై క్లిక్ చేయాలి.
- ఇలా క్లిక్ చేసిన తర్వాత మార్చిలో జరిగిన పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు.
- మీకు స్క్రీన్‌పై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాల పీడీఎఫ్ కనిపిస్తుంది.
- అందులో అందులో Ctrl+F అని టైప్ చేస్తే సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- అక్కడ మీ రోల్ నెంబర్ లేదా పేరు టైప్ చేయాలి. అప్పుడు మీరు పేరు హైలైట్ అవుతుంది. అలా కాకపోతే మీ పేరు లేనట్టు లెక్క.
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాలు 2025లో ఏముంది? (What details are mentioned in the result?)
ఇవాళ విడుదల చేసిన 2025 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాల్లో ఏముందని చూస్తే ఫలితాల్లో అభ్యర్థి పేరు, పరీక్ష కేంద్రం పేరు, రోల్ నెంబర్, ఆ వ్యక్తి ఏ కేటగిరి, పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి. వచ్చే దశ పరీక్షకు అర్హత సాధించారా లేదా అనేది వివరింగా చెబుతుంది.
కటాఫ్ ఏ కేటగిరికి ఎంత? (Check RPF Constable cut off for female and Male)
ఇది పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఉంది ముందు మహిళల విభాగంలో చూస్తే... ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 73.75247మార్కలు కటాఫ్‌గా తేల్చారు. అదే SCలకు 66.37005, STలకు 62.27005,OBCలకు 70.17768, EWSలకు 68.89424 మార్కులు కటాఫ్‌గా వెబ్‌సైట్‌లో పెట్టారు. అదే అబ్బాయిలకు ఓపెన్ కేటగిరిలో76.82267, SCలకు 70.19086, STలకు 65.67731, OBCలకు 74.06154, EWSలకు 71.92622కటాఫ్‌గా నిర్ణయించినట్టు తెలిపారు.





















