(Source: ECI/ABP News/ABP Majha)
BC Backlog Posts: ఆర్జీయూకేటీల్లో 230 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో బీసీ బ్యాక్‌లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీచేయనున్నారు.
AP Recruitment : ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో బీసీ బ్యాక్‌లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 230 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 20న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు దరఖాస్తు హార్డ్ కాపీలతో సెల్ఫ్ అటెస్టేషన్ చేయించిన డాక్యుమెంట్లను నవంబర్ 27లోపు నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2000 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
వివరాలు..
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 230.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (బీసీ బ్యాక్‌లాగ్): 35 పోస్టులు
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (రెగ్యులర్): 195 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: బయాలజీ - 02, కెమికల్ ఇంజినీరింగ్ - 05, కెమిస్ట్రీ - 02, సివిల్ ఇంజినీరింగ్ - 25, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ - 63, ఎకనామిక్స్ - 03, ఈఈఈ - 24, ఈసీఈ - 63, ఇంగ్లిష్ - 05, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ - 02, మేనేజ్‌మెంట్ - 01, మ్యాథమెటిక్స్ - 10, మెకానికల్ ఇంజినీరింగ్ - 20, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్ - 03, ఫిజిక్స్ - 02.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ అర్హత ఉండాలి. యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్/స్లెట్/ఏపీసెట్ అర్హత ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత గేట్/జీప్యాట్/సీడ్‌తోపాటు పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ.57,700 - రూ.1,82,400 చెల్లిస్తారు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2000 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచే ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు).
అర్హత మార్కులు: రాతపరీక్షలో అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతంగా; బీసీలకు 35 శాతంగా; జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar
Rajiv Gandhi University of Knowledge Technologies
I-3 Administrative Building
Nuzvid Campus, Mylavaram Road,
City: Nuzvid
District: Eluru
Andhra Pradesh – Pin Code:521202.
ముఖ్యమైన తేదీలు..
➤ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023. (5 P.M.)
➤ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023. (5 P.M.)
➤ ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి: 30.11.2023.
➤ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023 (5.00 P.M)
➤ తుది ఎంపిక జాబితా వెల్లడి: 08.12.2023.
ALSO READ:
ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..