RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 35 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో బీఈ, బీటెక్, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 35.
1. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(ప్రొడక్షన్): 11 పోస్టులు
అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథమెటిక్స్) లేదా డిప్లొమా(కెమికల్ ఇంజినీరింగ్ / టెక్నాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(ప్రొడక్షన్): 06 పోస్టులు
అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథమెటిక్స్) లేదా డిప్లొమా(కెమికల్ ఇంజినీరింగ్ / టెక్నాలజీ)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(మెకానికల్): 03 పోస్టులు
అర్హత: డిప్లొమా(కెమికల్ ఇంజినీరింగ్ / టెక్నాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(ఎలక్ట్రికల్): 01 పోస్టులు
అర్హత: డిప్లొమా(ఎలక్ట్రికల్) లేదా ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/టెక్నాలజీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
5. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(ఇన్‌స్ట్రుమెంటేషన్): 04 పోస్టులు
అర్హత: డిప్లొమా(ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్
& కంట్రోల్ లేదా ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
6. ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(ఇన్‌స్ట్రుమెంటేషన్): 02 పోస్టులు
అర్హత: డిప్లొమా(ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్
& కంట్రోల్ లేదా ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
7. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(కెమికల్ ల్యాబ్): 02 పోస్టులు
అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
8. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ III: 06 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్ (ఎంఎస్ ఎక్సల్/ఎంఎస్ వర్డ్/ఎంఎస్ పీపీటీ) సంబంధిత ఫంక్షన్లలో అడ్వాన్స్ కంప్యూటర్ నైపుణ్యాలను కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్‌లో సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(ప్రొడక్షన్/మెకానికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్ ల్యాబ్)&ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ III పోస్టులకు రూ.23,000-56,500. ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II(ప్రొడక్షన్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులకు రూ.25,000-77,000.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2024.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024.