(Source: ECI/ABP News/ABP Majha)
RBI Recruitment 2024: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో గ్రేడ్-బి ఆఫీసర్స్ పోస్టులు, ఎంపికైతే లక్ష రూపాయల వరకు జీతం
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. జులై 25న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా.. ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Reserve Bank of India Grade-B officers Application: ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 16న సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
* ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
ఖాళీల సంఖ్య: 94.
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-37, ఎస్సీ-12, ఎస్టీ-14, ఓబీసీ-24, ఈడబ్ల్యూఎస్-07.
➥ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్): 66 పోస్టులు
విభాగం: జనరల్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. (లేదా) కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి(డీఆర్): 21 పోస్టులు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ & పాలసీ రిసెర్చ్ (డీఈపీఆర్).
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎకనామిక్స్/ఫైనాన్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఎకనామిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ/ రిసెర్చ్ అనుభవం/టీచింగ్ అనుభవం లేదా ఎకనామిక్స్‌లో జర్నల్స్ కావాల్సిన అర్హతలుగా ఉండాలి.
➥ ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్): 07 పోస్టులు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (డీఎస్‌ఐఎం).
అర్హతలు..
➥ కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ఎకనామెట్రిక్స్/స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మాటిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మాటిక్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్) లేదా తత్సమాన విద్యార్హతతో ఏడాది పీజీ డిప్లొమా (స్టాటిక్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (డేటా సైన్స్/ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ /మెషిన్ లెర్నింగ్ /బిగ్ డేటా అనలిటిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 60 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ (డేటా సైన్స్/ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ /మెషిన్ లెర్నింగ్ /బిగ్ డేటా అనలిటిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 55 శాతం మార్కులతో రెండేళ్ల పీజీ డిప్లొమా (బిజినెస్ అనలిటిక్స్-పీజీడీబీఏ) ఉత్తీర్ణులై ఉండాలి.
➥ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ ఎంఫిల్, పీహెచ్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1994 - 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బ్యాంకింగ్ రంగంలో పనిచేసి వివిధ కారణాల చేత ఉద్యోగం కోల్పోయిన మాజీ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎంఫిల్ అర్హత ఉన్నవారికి 32 సంవత్సరాల వరకు, పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి 34 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.850 +18 % జీఎస్టీ; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.850 +18 % జీఎస్టీ చెల్లించాలి. సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.07.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.08.2024.
➥ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) జనరల్:
- ఫేజ్-1 పరీక్ష తేదీ: 08.09.2024.
- ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 19.10.2024.
➥ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) డీఈపీఆర్:
- ఫేజ్-1 పరీక్ష తేదీ: 14.09.2024.
- ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 26.10.2024.
➥ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్‌ఐఎం:
- ఫేజ్-1 పరీక్ష తేదీ: 14.09.2024.
- ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 26.10.2024.