RMLH: రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో 140 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
RMLH Recruitment: న్యూఢిల్లీలోని ఏబీవీపీఐఎంఎస్, ఆర్ఎంఎల్హెచ్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. దరఖాస్తుకు జూన్ 29 వరకు అవకాశం ఉంది.
RMLH Recruitment Notification: న్యూఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు నెలకు రూ.67,700-రూ.2,08,700 వరకు జీతంగా ఇస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 140
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాక్ అనస్థీషియా, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఓ అండ్ జీ, మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పీఎంఆర్, రేడియాలజీ, సర్జరీ, అనస్థీషియా, అనాటమీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫిజియాలజీ, ఫార్మకాలజీ.
విభాగాలవారీగా ఖాళీలు..
➥ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్(బ్లడ్ బ్యాంక్): 04 పోస్టులు
➥ కార్డియాక్ అనస్థీషియా: 04 పోస్టులు
➥ ఎండోక్రైనాలజీ: 05 పోస్టులు
➥ ఫోరెన్సిక్ మెడిసిన్: 01 పోస్టు
➥ గ్యాస్ట్రోఎంటరాలజీ: 03 పోస్టులు
➥ ఒబెస్ట్రిక్స్ & గైనకాలజీ: 05 పోస్టులు
➥ మెడిసిన్: 12 పోస్టులు
➥ మైక్రోబయాలజీ: 01 పోస్టు
➥ నియోనాటాలజీ: 14 పోస్టులు
➥ ఆఫ్తాల్మాలజీ: 03 పోస్టులు
➥ ఆర్థోపెడిక్స్: 02 పోస్టులు
➥ పీడియాట్రిక్స్: 17 పోస్టులు
➥ పాథాలజీ: 06 పోస్టులు
➥ పీఎంఆర్: 01 పోస్టు
➥ రేడియాలజీ: 09 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా/డీఎన్బీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెంట్రల్ డైరీ అండ్ డిస్పాచ్ సెక్షన్, గేట్ నెం.3 దగ్గర, ఏబీవీఐఎంఎస్ అండ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష ఆధారంగా.
జీతం: నెలకు రూ.67,700-రూ.2,08,700.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు చివరి తేదీ: 29.06.2024.
➥ అడ్మిట్ కార్డ్ అప్లోడ్ తేదీ: 22.07.2024.
➥ రాత పరీక్ష తేదీ: 28.07.2024.
➥ ఫలితాల ప్రకటన: 01.08.2024.
ALSO READ:
NIMS: నిమ్స్‌లో 51 సీనియర్ రెసిడెంట్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక పూర్తి వివరాలు ఇలా
హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ (NIMS) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆసక్తి, సరైన అర్హతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 51 ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా నిర్ణీత రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికేట్లు జతచేసి జూన్ 26లోగా నిమ్స్ కార్యాలయంలో సమర్పించాలి. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఖాళీలను భర్తీచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..