RRB Technicain Recruitment 2024: రైల్వే టెక్నీషియన్ అభ్యర్థులకు అలర్ట్, వివరాల సవరణకు మరో అవకాశం
RRB: రైల్వేశాఖలో 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి తప్పుల సవరణకు ఆర్‌ఆర్‌బీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ స్పష్టమైన పాస్‌పోర్టు ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
RRB Technician Application Edit: దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మార్చి 8న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల సవరణకు ఏప్రిల్ 9 నుంచి 18 వరకు అవకాశం కల్పించింది. అయితే కొందరు అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ ఫొటోగ్రాఫ్, సంతకం నిర్ణీత విధానంలో అప్‌లోడ్ చేయని కారణంగా పొరపాట్లు చోటుచేసుకున్నాయి. అలాంటి అభ్యర్థులకు తప్పులను సరిదిద్దుకొనే అవకాశాన్ని ఆర్‌ఆర్‌బీ కల్పించింది. ఈ మేరకు మే 28న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫొటోగ్రాఫ్, సంతకాన్ని సరిగా జతచేయని అభ్యర్థులకు ఈమెయిల్/ ఎస్‌ఎంఎస్‌లను ఆర్‌ఆర్‌బీ ఇప్పటికే సమాచారం పంపింది. అభ్యర్థులు జూన్ 3 నుంచి జూన్ 7న రాత్రి 11.59 వరకు తప్పులు సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థులు తమ స్పష్టమైన పాస్‌పోర్టు ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వివరాలు..
🔰 టెక్నీషియన్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 9,144
➥ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,092 పోస్టులు
➥ టెక్నీషియన్ గ్రేడ్-III: 8052 పోస్టులు
టెక్నీషియన్ (గ్రేడ్-I) సిగ్నల్ పోస్టులు..
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటగిరీలవారీగా 3-6-8 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు; రైల్వే (గ్రూప్-సి, గ్రూప్-డి) ఉద్యోగులకు కేటగిరీలవారీగా 40-43-45 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. రైల్వే శాఖలో క్వాసీ-అడ్మినిస్ట్రేటివ్ (క్యాంటిన్, సహకార సంఘాలు, ఇతర) కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి 5 సంవత్సరాలపాటు లేదా నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.
టెక్నీషియన్ (గ్రేడ్-III) పోస్టులు..
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటగిరీలవారీగా 3-6-8 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు; రైల్వే (గ్రూప్-సి, గ్రూప్-డి) ఉద్యోగులకు కేటగిరీలవారీగా 40-43-45 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. రైల్వే శాఖలో క్వాసీ-అడ్మినిస్ట్రేటివ్ (క్యాంటిన్, సహకార సంఘాలు, ఇతర) కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి 5 సంవత్సరాలపాటు లేదా నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది. అదేవిధంగా ఒంటరి/వితంతు మహిళలకు కేటగిరీలవారీగా 35-38-40 సంవత్సరాలు,; ఐటీఐ అర్హత ఉండి, యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసినవారికి 3 సంవత్సరాలవరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం:
ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.04.2024.