PGCIL: పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏ లేదా సీఎంఏ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏ లేదా సీఎంఏ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరంలేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 20
పోస్టుల కేటాయింపు: జనరల్-08, ఓబీసీ-06, ఎస్సీ-02, ఎస్టీ-02, ఈడబ్ల్యూఎస్-02. వీటిలో దివ్యాంగులకు 2 పోస్టులను కేటాయించారు.
అర్హత: సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 13.11.2023 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. 13.11.1995 తర్వాత జన్మించినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, బిహేవియరల్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో రాతపరీక్షక 85 శాతం మార్కులు, గ్రూప్ డిస్కషన్‌ను 3 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు 12 శాతం మార్కులు కేటాయించారు
పరీక్ష (సీబీటీ) విధానం: మొత్తం 170 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రొఫెషనల్ టెస్ట్(PKT)-120 మార్కులు, ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(EAT)-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు ఇస్తారు. నెగటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్య్యూ నిర్వహిస్తారు.
సీబీటీ అర్హత మార్కులు: అర్హత మార్కులను PKT పరీక్షకు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించగా, EAT పరీక్షకు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 శాతంగా, ఎస్సీ-ఎస్టీలకు 25 శాతంగా నిర్ణయించారు.
ఇంటర్వ్యూ అర్హత మార్కులు: ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
సర్వీస్ అగ్రిమెంట్ బాండ్: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేయనున్నట్లు రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2.5 లక్షలకు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 13.11.2023.
ALSO READ:
➥ ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో 142 నాన్ టీచింగ్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
➥ ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ పోస్టులు
➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు