PGCIL Recruitment: పీజీసీఐఎల్‌లో 184 ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు, వివరాలు ఇలా
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) గేట్ 2023 ద్వారా ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) గేట్ 2023 ద్వారా ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 184 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్స్ ఇంజినీర్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 184
* ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్స్ ఇంజినీర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 10.11.2023 నాటికి గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: గేట్ 2023, బిహేవియరల్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్ & పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 20.10.2023
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరితేదీ: 10.11.2023
ALSO READ:
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..