By: ABP Desam | Updated at : 19 Dec 2022 10:16 PM (IST)
Edited By: omeprakash
కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీలు
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 14 వేలకు పైగా బోధన, బోధనేతర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,277 పోస్టులు ఖాళీగా ఉండగా.. తమిళనాడులో 1,220, కర్ణాటకలో 1,053, పశ్చిమబెంగాల్‌లో 1,043 చొప్పున ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. సిక్కింలో కేవలం 12 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలను వెల్లడించింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానమిచ్చారు.
కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తంగా 14,461 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇప్పటికే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని.. నిబంధనల ప్రకారమే ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంచేశారు. విద్యార్థులకు బోధన- అభ్యాస ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు కేవీల ద్వారా తాత్కాలికంగా ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించినట్టు తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాలకు నోటిఫికేషన్
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇటీవలే 13,404 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉండగా; 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఖాళీలవారీగా ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఈఎల్ఈడీ, బీఈడీ అర్హతలున్న అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
SIDBI AM Recruitment: సిడ్బీలో 100 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ(కామర్స్/ ఎకనామిక్స్/ మేనేజ్‌మెంట్)/ సీఏ/సీఎస్/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్ఏ/ సీఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్/ ఎంఎస్సీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి.. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్