NHPC: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజినీర్ & ట్రైనీ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) ట్రైనీ ఇంజినీర్ & ట్రైనీ ఆఫీసర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Jobs 2024: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) ట్రైనీ ఇంజినీర్ & ట్రైనీ ఆఫీసర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాలలో డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 98
ట్రైనీ ఇంజినీర్(సివిల్): 22
అర్హత: గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ విభాగంలో కనీసం 60% మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్‌తో AICTEచే ఆమోదించబడిన ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ/ బీఎస్సీ(ఇంజినీరింగ్) కలిగి ఉండాలి. లేదా కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో AMIEలో 31.05.2013 వరకు నమోదు చేసుకోవాలి. సివిల్ విభాగం అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర విభాగాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
ట్రైనీ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 17
అర్హత: గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ విభాగంలో కనీసం 60% మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్‌తో AICTEచే ఆమోదించబడిన ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ/ బీఎస్సీ(ఇంజినీరింగ్) కలిగి ఉండాలి. లేదా కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో AMIEలో 31.05.2013 వరకు నమోదు చేసుకోవాలి. ఎలక్ట్రికల్ విభాగం(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ & హై వోల్టేజ్/ పవర్ ఇంజినీరింగ్). ఎలక్ట్రికల్ విభాగం అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర విభాగాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
ట్రైనీ ఇంజినీర్(మెకానికల్): 50
అర్హత: గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ విభాగంలో కనీసం 60% మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్‌తో AICTEచే ఆమోదించబడిన ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ/ బీఎస్సీ(ఇంజినీరింగ్) కలిగి ఉండాలి. లేదా కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో AMIEలో 31.05.2013 వరకు నమోదు చేసుకోవాలి. మెకానికల్ విభాగం(మెకానికల్ / ప్రొడక్షన్ / థర్మల్ / మెకానికల్ మరియు ఆటోమేషన్ ఇంజనీరింగ్). మెకానికల్ విభాగం అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర విభాగాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్): 09
అర్హత: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సీఏ/ ఐసీడబ్ల్యూఏ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సీఎంఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 22.01.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్, సీఏ/సీఎంఏ స్కోర్, మెరిట్ మరియు ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 02.01.2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: 22.01.2024