NMDC: ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 120 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, వాక్-ఇన్ తేదీలివే!
దంతెవాడలోని 'నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NMDC), బచేలి కాంప్లెక్స్‌లో పలు విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BIOM Trade Apprentice Recruitment: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడలోని 'నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NMDC), బచేలి కాంప్లెక్స్‌లో పలు విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2 నుంచి 26 వరకు వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఖాళీలను భర్తీచేస్తారు.
వివరాలు..
* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 120.
➥ మెకానిక్ డీజిల్: 25 పోస్టులు
అర్హత: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీచేసిన ఐటీఐ (మెకానిక్ డీజిల్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ ఫిట్టర్: 20 పోస్టులు
అర్హత: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీచేసిన ఐటీఐ (ఫిట్టర్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ ఎలక్ట్రీషియన్: 30 పోస్టులు
అర్హత: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీచేసిన ఐటీఐ (ఎలక్ట్రీషియన్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్): 20 పోస్టులు
అర్హత: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీచేసిన ఐటీఐ (వెల్డర్- గ్యాస్ & ఎలక్ట్రికల్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ మెకానిక్ (మోటార్ వెహికల్): 20 పోస్టులు
అర్హత: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీచేసిన ఐటీఐ (మెకానిక్- మోటార్ వెహికల్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ మెషినిస్ట్: 05 పోస్టులు
అర్హత: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీచేసిన ఐటీఐ (మెషినిస్ట్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అప్రెటింటిస్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు..
➦ మెకానిక్ డీజిల్ పోస్టులకు: 22.02.2024.
➦ ఫిట్టర్ పోస్టులకు: 23.02.2024.
➦ ఎలక్ట్రీషియన్ పోస్టులకు: 24.02.2024.
➦ వెల్డర్ పోస్టులకు: 25.02.2024.
➦ మెకానిక్ (మోటార్ వెహికిల్) పోస్టులకు: 26.02.2024.
➦ మెషినిస్ట్ పోస్టులకు: 26.02.2024.
సమయం: ఉదయం 10.00 గం.
ఇంటర్వ్యూ వేదిక:
Training Institute,
Bailadila Iron Ore Mines (BIOM),
Bacheli Complex, Bacheli,
Dantewada, Chhattisgarh.
ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తీసుకురావాల్సిన డాక్యుమంట్లు..
➥ ఫొటో జతచేసిన రెజ్యూమ్
➥ పుట్టినతేది ధ్రువీకరణ పత్రం
➥ పాన్‌కార్డు
➥ ఆధార్ కార్డు
➥ ఆధార్‌తో లింక ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు
➥ చిరునామా వివరాలు
➥ విద్యార్హత సర్టిఫికేట్లు
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ ఒరిజినల్ పత్రాలతోపాటు, ఫొటోకాపీలు తీసుకెళ్లాలి.
ALSO READ:
ఏపీ వైద్యారోగ్యశాఖలో 234 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య సేవల నియామక మండలి, 'నేషనల్ హెల్త్ మిషన్'లో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 'స్పెషలిస్ట్ డాక్టర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్, డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్, తదితర ఆసుపత్రుల్లో 234 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 7న రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. అడకమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..