NICL Recruitment: నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో 274 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఎన్‌సీ) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 274 ఖాళీలను భర్తీచేయనున్నారు.
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఎన్‌సీ) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 274 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 2 నుంచి 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 274.
పోస్టుల కేటాయింపు: యూఆర్-125, ఈడబ్ల్యూఎస్-27, ఓబీసీ-57, ఎస్సీ-44, ఎస్టీ-21.
➥ డాక్టర్స్ (ఎంబీబీఎస్): 28 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్/ఎండీ/ ఎంఎస్ లేదా పీజీ-మెడికల్ డిగ్రీ.
➥ లీగల్: 20 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్/పీజీ లా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ ఫైనాన్స్: 30 పోస్టులు
అర్హత: ఐసీఏఐ/ఐసీడబ్ల్యూఏ లేదా కనీసం 60 శాతం మార్కులతో బీకామ్/ ఎంకామ్ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే
సరిపోతుంది.
➥ ఆక్చువరియల్: 02 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఆక్చువరియల్ సైన్స్) ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ: 20 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)/ఎంసీఏ. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ ఆటోమొబైల్ ఇంజినీర్స్: 20 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ (ఆటోమొబైల్ ఇంజినీరింగ్)/ఎంసీఏ. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ జనరలిస్ట్: 130 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ హిందీ (రాజ్‌భాషా) ఆఫీసర్స్: 22 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(హిందీ/ఇంగ్లిష్ ). ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ బ్యాక్‌లాగ్: 02 పోస్టులు
వయోపరిమితి: 01.12.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.12.1993 - 01.12.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఢిఫెన్స్ పర్సనల్స్‌కు 3 సంవత్సరాలు, వితంతువులు-విడాకులు పొందిన ఒంటి మహిళలకు 9 సంవత్సరాలు, పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు 8 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. అయితే హిందీ ఆఫీసర్స్ పోస్టుకు ప్రిలిమ్స్ పరీక్ష ఉండదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఫేజ్-1 పరీక్షలు విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌లో నిర్వహిస్తారు. ఇక ఫేజ్-2 పరీక్ష (హిందీ-రాజ్‌బాష) పరీక్షను ఏపీ, తెలంగాణ కలిపి కేవలం హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.01.2024.