NIN: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా
NIN Recruitment: సిక్కింలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIN Recruitment: సిక్కింలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్మతలున్నవారు మే 30, 31 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 19
1. జూనియర్ మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంబీబీఎస్/ఆయుష్/బీడీఎస్ డిగ్రీ పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.6000.
2. ఎస్‌ఆర్‌ఎఫ్: 02 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ/ఎంపీహెచ్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్, హోమ్ సైన్స్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44450.
3. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి గ్రాడ్యూయేట్(ఆంత్రోపాలజీ, సోషల్ సైన్స్, సోషియాలజీ,సైన్స్(బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ), సోషల్ వర్క్ ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.32000.
4. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03 పోస్టులు
అర్హత: ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.31000.
5. ఫీల్డ్ వర్కర్: 08 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.18000.
ఇంటర్వ్యూ తేదీ: 30, 31.05.2024.
వేదిక: Department of Community Medicine, Sikkim Manipal Institute of Medical Sciences, 5th Mile Tadong, Gangtok, Sikkim- 737102.
ALSO READ:
యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (2)-2024 నోటిఫికేషన్ వెల్లడి, 404 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (II)- 2024 నోటిఫికేషన్ మే 15న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో దాదాపు 404 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2024, సెప్టెంబరు 1న రాతపరీక్ష నిర్వహించనుంది. శిక్షణతోపాటు త్రివిధ దళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 15 నుంచి, జూన్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆ తర్వాత జూన్ 5 నుంచి 11 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2025, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జులై 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే 154వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 116వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..