అన్వేషించండి

UPSC NDA & NA Notification: యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (1)-2024 నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (I)- 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (I)- 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2024, ఏప్రిల్ 21న రాతపరీక్ష నిర్వహించనుంది. శిక్షణ‌తోపాటు త్రివిధ ద‌ళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు డిసెంబరు 20 నుంచి, జనవరి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2025, జనవరి 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే 153వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 115వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 

పోస్టుల వివరాలు...

* ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (1)-2024

ఖాళీల సంఖ్య: 400

➜ నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 370 పోస్టులు (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120). 

➜ నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 30 

అర్హత: ఆర్మీ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇక నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: అభ్యర్థులు 02.07.2005 - 01.07.2008 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులకు రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం: 

* మొత్తం 900 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మొత్తం రెండు పేపర్లుంటాయి.

* పేపర్-1(మ్యాథమెటిక్స్)కు 300 మార్కులు, పేపర్-2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)కు 600 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.

* పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి.

* రాతపరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ/ఎస్‌ఎస్‌బీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 900 మార్కులు కేటాయించారు.

* రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.

కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. ఎంపికైనవారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2023.

➥  ఫీజు చెల్లించడానికి చివరితేది: 08.01.2023. (23:59)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.01.2023. 

➥ దరఖాస్తుల సవరణ: 10.01.2024 - 16.01.2024.

➥ ఆన్‌లైన్ రాత పరీక్ష: 21.04.2024. 

➥ కోర్సులు ప్రారంభం: 02.01.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
Pant Career Crossroads: టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
Cockroach Janata Party: దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
Embed widget