Narayana Murthy: యువత వారానికి 72 గంటల పని చేస్తేనే చైనాను ఎదుర్కోగలం - ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి తాజా సలహా
Infosys: చైనాలో యువత వారానికి 72 గంటలు పని చేస్తారని.. చైనాను దాటాలంటే.. మన యువత కూడా అదే స్థాయిలో పని చేయాలని నారాయణమూర్తి మరోసారి పిలుపునిచ్చారు.

Narayana Murthy pitches 72 hours work week again: ఇన్ఫోసిస్ సహ-స్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి మళ్లీ 72 గంటల వారానికి పని చేయాలని పిలుపునిచ్చారు. చైనా ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవాలంటే భారత యువత గట్టిగా పని చేయాలని, చైనాలో ప్రసిద్ధి చెందిన '9-9-6' రూల్‌ను ఉదాహరణగా చెప్పారు. "9 ఏఎమ్ నుంచి 9 పీఎమ్ వరకు, వారానికి 6 రోజులు—అంటే 72 గంటలు" అని వివరించారు. గతేడాది 70 గంటల వర్క్‌వీక్ వ్యాఖ్యలతో దేశవ్యాప్త చర్చనీయాంశమైన మూర్తి, ఈసారి చైనా కల్చర్ ను సాక్ష్యంగా చూపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఓ టీవీ చానల్ తో మాట్లాడనప్పుడు నారాయణమూర్తి భారత్ చైనా ఆర్థిక బలాన్ని ఎదుర్కోవాలంటే అందరూ ఉన్నత స్థాయి పని చేయాలని చెప్పారు. "గతేడాది మా నేపాల్ సీనియర్, మిడ్-లెవల్ స్టాఫ్ చైనాకు వెళ్లారు. టైర్-1, టైర్-2, టైర్-3 సిటీల్లో ఉం హోటల్స్‌లో ఉన్నారు. అక్కడ 9-9-6 అనే పాలసీ అమల్లో ఉంది. అటే 9 ఏఎమ్ నుంచి 9 పీఎమ్ వరకు, వారానికి 6 రోజులు. అది 72 గంటలు అని వివరించారు.
ఈ '9 9 6' రూల్, చైనా టెక్, స్టార్టప్ రంగాల్లో ప్రసిద్ధి చెందినది, అలీబాబా సహ-స్థాపకుడు జాక్ మా వంటి నాయకులు మద్దతు ఇచ్చినప్పటికీ, 2021లో చైనా సుప్రీం పీపుల్స్ కోర్ట్ దీన్ని "అక్రమం"గా ప్రకటించింది. చైనా చట్టాల ప్రకారం వారానికి 44 గంటలు మాత్రమే చట్టబద్ధం, "మోడరన్ స్లేవరీ"గా విమర్శించారు. మూర్తి, తన 70 గంటల వ్యాఖ్యలను ఈసారి 72 గంటలుగా పెంచి, ప్రధాని మోదీ 100 గంటలు పని చేస్తున్నారని ఉదాహరణగా చెప్పారు. "ఇది యువతకు మోడల్. గట్టిగా పని చేసి, పేదలకు అవకాశాలు కల్పించాలి" అని అన్నారు.
🚨 "There is a saying in China, 9, 9, 6. You know what it means? 9 am to 9 pm, 6 days a week. And that is 72 hours work-week, " said Narayana Murthy. pic.twitter.com/FCeNFynG1F
— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2025
గతంలో 2023లో 70 గంటల వ్యాఖ్యలు చేసిన మూర్తి, "భారత్ ప్రొడక్టివిటీ ప్రపంచంలో అతి తక్కువ" అని వాదించారు. 2020లో కూడా పాండమిక్ తర్వాత 60 గంటలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సారి చైనా ఉదాహరణతో, భారత్ జపాన్, జర్మనీలా పోస్ట్-వార్ రికవరీలో గట్టిగా పని చేసినట్లుగా చేయాలని సూచించారు. "వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ముందు లైఫ్ పొందాలి" అని కూడా పేర్కొన్నారు. భారత్‌లో లేబర్ లా ప్రకారం వారానికి 48 గంటలు మాత్రమే చట్టబద్ధం. అందుకే ఈ అంశంపై మరోసారి చర్చ ప్రారంభమయింది.





















