MNNIT Recruitment: మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో 103 నాన్-టీచింగ్ పోస్టులు
సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 15లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 19న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారభంకాగా.. ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎన్‌ఎన్‌ఐటి)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 15లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 19న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారభంకాగా.. ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 103
1. సూపరింటెండెంట్: 03 పోస్టులు
2. పర్సనల్ అసిస్టెంట్ : 01 పోస్టు
3. సీనియర్ స్టెనోగ్రాఫర్: 01 పోస్టు
4. సీనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
5. జూనియర్ అసిస్టెంట్: 04 పోస్టులు
6. ఆఫీస్ అటెండెంట్/ ల్యాబ్ అటెండెంట్: 21 పోస్టులు
7. ఫార్మసిస్ట్: 02 పోస్టులు
8. టెక్నికల్ అసిస్టెంట్: 20 పోస్టులు
9. జూనియర్ ఇంజినీర్ సివిల్/ ఎలక్ట్రికల్: 05 పోస్టులు
10. ఎస్ఏఎస్ అసిస్టెంట్: 01 పోస్టు
11. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 పోస్టు
12. సీనియర్ టెక్నీషియన్: 15 పోస్టులు
13. టెక్నీషియన్: 28
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.02.2023.
Also Read:
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనుంది. సరైన అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 21 నంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, వీరికి ప్రత్యేకం! ఈ అర్హతలు ఉండాలి!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 42 చార్టర్డ్ అకౌంటెంట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..