Lab-Technician Notification: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఎంపికైతే రూ.96 వేల వరకు జీతం
Lab-Technician Posts: తెలంగాణ వైద్యారోగ్య శాఖ పరిధిలో పలు విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 5 మధ్య దరఖాస్తులు సమర్పించాలి.
MHSRB Lab-Technician Recruitment: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్(Lab-Technician) పోస్టుల భర్తీకి రాష్ట్ర మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రజారోగ్య-కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్(DPHFW/DME), వైద్యవిధాన పరిషత్(TVVP), ఎంఎన్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్(MNJIO & RCC) పరిధిలో 1284 ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబరు 7, 8 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్నవారికి నవంబరు 10న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
* ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1284.
జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 218, జోన్-2: 135, జోన్-3: 173, జోన్-4: 191, జోన్-5: 149, జోన్-6: 220, జోన్-7: 185.
విభాగాలవారీగా ఖాళీలు..
1) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 1088 పోస్టులు
జీతం: రూ.32,810 – రూ.96,890.
2) తెలంగాణ వైద్యవిధాన పరిషత్: 183 పోస్టులు
జీతం: రూ.32,810 – రూ.96,890.
3) మెహిదీ నవాజ్ జంగ్(MNJ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 13 పోస్టులు
జీతం: రూ.31,040 – రూ.92,050.
విద్యార్హతలు..
➥ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు
➥ ఎంఎల్‌టీ(ఒకేషనల్)/ఇంటర్ (ఎంఎల్‌టీ ఒకేషనల్)తోపాటు ఏడాది క్లినికల్ ట్రైనింగ్/అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనుభవం ఉండాలి.
➥ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్-టెక్నీషియన్ కోర్సు (DMLT)
➥ బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ఎంఎస్సీ (ఎంఎల్‌టీ)
➥ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ) టెక్నీషియన్ కోర్సు
➥ బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ (BMLT)
➥ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ
➥ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ
➥ బీఎస్సీ (మైక్రోబయాలజీ)/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ)
➥ ఎంఎస్సీ (మెడికల్ బయోకెమిస్ట్రీ)
➥ ఎంఎస్సీ (క్లినికల్ మైక్రోబయాలజీ)
➥ ఎంఎస్సీ (బయోకెమిస్ట్రీ)
➥ తెలంగాణ పారామెడికల్ బోర్డు సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700 చెల్లించాలి. ఇందులో రూ.500 ఆన్‌లైన్ పరీక్ష ఫీజు కింద, అలాగే ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి ఫీజు మినహాయింపులు వర్తించవు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో రాతపరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొ్ండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.09.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 05.10.2024. (5.00 pm)
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 07.10.2024 - 08.10.2024. (10.00 AM to 5.00 PM)
➥ పరీక్షతేదీ: 10.11.2024.