By: ABP Desam | Updated at : 14 Jul 2022 08:07 AM (IST)
ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందాలనుకున్న యువకుడి అరెస్ట్
ఈ మధ్య చాలా మంది తాము చదివిన చదువులకు సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అందులోనూ కరోనా తర్వాత సాఫ్ట్ వేర్ రంగం పుంజుకోవడంతో చాలా మంది అటువైపే మొగ్గు చూపుతున్నారు. అయితే తమకు అర్హత లేకపోయినా నకిలీ ధ్రువ పత్రాలు చూపించి మరీ ఉద్యోగాల్లో చేరిపోవాలనుకుంటున్నారు. కొందరు డిగ్రీ, పీజీకి సంబంధించిన నకిలీ సర్టిఫికేట్లు పెడుతుండగా.. మరి కొందరేమో ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు పెడుతున్నారు.
చిన్న చిన్న కంపెనీలు అంతగా ఎంక్వైరీ చేయకపోవడంతో వాళ్ల దందా సాగిపోతోంది. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతున్నాయి. అదే పెద్ద కంపెనీల్లో అయితే ఇట్టే దొరికిపోతున్నారు. చివరకు జైల్లో కూర్చొని ఊచలు లెక్కబెడుతున్నారు. అలాంటి ఓ ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
అసలేమైంది..?
మల్లికార్జున్ అనే యువకుడు పెద్దగా చదువుకోలేదు. కానీ అందరి ముందు హుందాగా బతకాలంటే పెద్ద ఉద్యోగం సంపాదించాల్సిందే అనుకున్నాడు. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించి.. చివరకు సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం పొందాలనుకున్నాడు. అందుకోసం ఎలాంటి దారిలో నడిచేందుకు సిద్ధపడ్డాడు. ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్న అతడు నకలీ డిగ్రీ సర్టిఫికేట్లను సృష్టించాడు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యూనివర్సిటీ పేరుతో సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. కానీ కథంతా ఇక్కడే అడ్డం తిరిగింది. రిక్రూట్ మెంట్ ప్రొసీర్ లో భాగంగా ఈ సర్టిఫికేట్లను తనిఖీ చేసిన కంపెనీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కంపెనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే మల్లికార్జున్ ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నాడనే నిజం బయట పడింది. నకిలీ ధ్రువ పత్రాలు సమర్పించి ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. అయితే అతడు ఎక్కడ నుంచి పేక్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడని విచారించగా ఓ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. వెంటనే మల్లికార్జున్ తో పాటు అతడికి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మల్లికార్జున్ కు భవిష్యత్తులో ఎక్కడా ఉద్యోగం వచ్చే అవకాశం లేకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు. అలాగే యువత ఇలాంటి పనులు చేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దని హితవు పలికారు.
ఎక్కువ జీతం వస్తుందనే ఆశతోనే లేదా పెద్ద పెద్ద ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల ఉండే సరైన మార్గంలో నడవాలని.. కానీ ఇలా తప్పుడు దారి ఎంచుకొని జీవితాన్ని పాడు చేసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో చాలా మంది సాఫ్ట్ వేర్ లో ఉద్యోగాల కోసం లక్షలు లక్షలు డబ్బులు పట్టి ఫేక్ సర్టిఫికేట్లు పొందడం.. ఉద్యోగాన్ని దక్కించుకోవడం.. ఆరు నెలలు కూడా గడవకముందే ఆ ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండి మీ అర్హతకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. అంతే కాని ఎట్టి పరిస్థితుల్లో నకిలీ ధ్రువ పత్రాలు, ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగం పొందకూడదని వివరిస్తున్నారు.
TS GENCO: జెన్కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>