News
News
X

KVS Recruitment Exams: నేటి నుంచి కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 5న విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలు కేంద్రీయ విద్యాలయం సంగతన్ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 5న విడుదల చేశారు.

పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీచెకింగ్ చేసుకోవడానికి అభ్యర్థులకు ఎలాంటి అవకావం ఉండదు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి పంపుతారు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు. ఆ తర్వాత ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.

ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కటాఫ్ మార్కులతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ అసిస్టెంట్ కమిషనర్

పరీక్షతేది: 07.02.2023

➥ ప్రిన్సిపల్ 

పరీక్షతేది: 08.02.2023

➥ వైస్ ప్రిన్సిపల్ & పీఆర్‌టీ (మ్యూజిక్)

పరీక్షతేది: 09.02.2023

➥ టీజీటీ

పరీక్షతేది: 12-14 ఫిబ్రవరి 2023

➥ పీజీటీ 

పరీక్షతేది: 16-20 ఫిబ్రవరి 2023

➥ ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ (సివిల్), హిందీ ట్రాన్స్‌లేటర్ 

పరీక్షతేది: 20.02.2023

➥ పీఆర్‌టీ

పరీక్షతేది: 21-28 ఫిబ్రవరి 2023

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

పరీక్షతేది: 01-05 మార్చి 2023.

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II

పరీక్షతేది: 06.03.2023

➥ లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ & సీనియర్ సెక్రిటేరియట్ అసిస్టెంట్

పరీక్షతేది: 06.03.2023.

6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

SSC Exams: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
సీజీఎల్ టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన టైర్-2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 6న ప్రకటించింది. వీటిలో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-2 పరీక్షను మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ ఫిబ్రవరి 6న ప్రకటించింది. అలాగే, 4500 లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష టైర్-1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
పరీక్ష పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, జనవరి 21 నుంచి దరఖాస్తులు!
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 07 Feb 2023 10:06 AM (IST) Tags: KVS Recruitment Exam Dates 2023 KVS Recruitment Exam Dates for primary teacher KVS Recruitment Exam 2023 KVS principal exam date KVS primary teacher exam date KVS PGT TGT exam date 2023 KVS PGT TGT exam date KVS Exam Hall Tickets

సంబంధిత కథనాలు

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!

REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...