Jobs in TS High Court: తెలంగాణ హైకోర్టులో పర్మినెంట్ జాబ్స్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ - అర్హత, లాస్ట్ డేట్ వివరాలు ఇవీ
TS High Court Jobs: దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ జూలై 22 సాయంత్రం 5 గంటలు. అభ్యర్థులు పోస్టు ద్వారా కాకుండా నేరుగా వెళ్లి కూడా దరఖాస్తులను ఇవ్వవచ్చు.
Jobs in Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 65 పోస్టులకు అర్హులైన వారిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేసుకోనున్నారు. కోర్టు మాస్టర్స్/జడ్జిలకి, రిజిస్ట్రార్‌లకు పర్సనల్ సెక్రటరీస్ ల పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తుదారులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ డిగ్రీ లేదా ఏదైనా న్యాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా కచ్చితంగా ఉండాలి. అభ్యర్థులు గతంలో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎక్సామ్‌లో కనీసం ఇంగ్లీష్ 180 వర్డ్స్ పర్ మినిట్ తో ఉత్తీర్ణులై ఉండాలి. 150 వర్డ్స్ పర్ మినిట్ తో ఉత్తీర్ణులైన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులకు 18 ఏళ్లు పూర్తయి ఉండాలి. ఇంకా జులై 1, 2022 నాటికి 34 ఏళ్లు దాటి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఇతర గిరిజన వర్గాలు, బీసీ, ఈడబ్ల్యూసీలకు గరిష్ఠంగా 5 ఏళ్ల వరకూ వయస్సులో సడలింపు ఉంటుంది. విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులు) గరిష్ఠంగా పదేళ్ల వరకూ వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
నిర్వహకులు నిర్వహించే స్కిల్ టెస్ట్ లో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులకు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. 180 wpm, 150 wpm కంప్యూటర్‌పై స్కి్ల్ టెస్టు ఉంటుంది. ఇది 80 మార్కులకి ఉండగా, ఇంటర్వ్యూకి 20 మార్కులు ఉంటుంది.
డిక్టేషన్, ట్రాన్స్‌క్రిప్షన్ షార్ట్‌హ్యాండ్ ఇంగ్లీష్ ఎక్సామ్ లో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1:13 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు.
అప్లికేషన్ ఫారం, నిబంధనలను తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ http://hc.ts.nic.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను స్పీడ్ పోస్టు ద్వారాగానీ, కొరియర్ ద్వారాగానీ ఎన్వలప్ పైన ‘‘అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆప్ కోర్ట్ పోస్ట్ మాస్టర్/పర్సనల్ సెక్రటరీ-2022’’ అని రాసి కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్
Registrar (Recruitment),
High Court for the State of Telangana,
Hyderabad-500066
దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ జూలై 22 సాయంత్రం 5 గంటలు. అభ్యర్థులు పోస్టు ద్వారా కాకుండా నేరుగా వెళ్లి కూడా దరఖాస్తులను ఇవ్వవచ్చు. పూర్తి వివరాలను తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ చూడండి.