ISRO Recruitment 2021: టెన్త్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.63 వేల వరకు జీతం..
నిరుద్యోగులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO- ఇస్రో) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (Liquid Propulsion Systems Centre- LPSC) లో ఖాళీగా ఉన్న 8 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్, ఫైర్ మెన్, క్యాటరింగ్ అటెండెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 6వ తేదీతో ముగియనుంది. ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది. సంస్థ అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు..
హెవీ వెహికిల్ డ్రైవర్ - 2
లైట్ వెహికల్ డ్రైవర్ - 2
కుక్ - 1
ఫైర్ మెన్ - 2
క్యాటరింగ్ అటెండెంట్ - 1
వయో పరిమితి, విద్యార్హత..
పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. ఇక ఫైర్ మెన్, క్యాటరింగ్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లుగా ఉంది. గరిష్ట వయో పరిమితి విషయంలో రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పలు సడలింపులు ఉన్నాయని నోటిఫికేషన్లో తెలిపింది.
వేతనం వివరాలు..
హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్, ఫైర్ మెన్ పోస్టులకు ఎంపికైన వారికి నెల వేతనం (లెవల్ 2 ప్రకారం) .. రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. క్యాటరింగ్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు (లెవల్ 1 ప్రకారం) రూ.18,000 నుంచి రూ.56,900 వేతనం చెల్లించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Army TGC Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగాలు...లక్షా యాభై వేలకుపైగా జీతం..