ITR: ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో అండ్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు, వివరాలు ఇలా
ITR Recruitment: చాందీపూర్ బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) తాత్కాలిక ప్రాతిపాదికన రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ITR Recruitment: చాందీపూర్ బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) తాత్కాలిక ప్రాతిపాదికన రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు గేట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 03
⏩ జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్): 02 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ECE) లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ETC) లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరీంగ్(E&I) లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరీంగ్(A,E&I), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(CSE) లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT).
అర్హత: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు ఉండాలి.
⏩ రిసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ): 01 పోస్టు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ECE) లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ETC) లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరీంగ్(E&I) లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరీంగ్(A,E&I), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(CSE) లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT).
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు గేట్ స్కోరు ఉండాలి.
వయోపరిమితి: జేఆర్‌ఎఫ్ పోస్టుకు 28 సంవత్సరాలు, ఆర్‌ఏ పోస్టుకు 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు జేఆర్‌ఎఫ్ పోస్టుకు రూ.37,000, ఆర్‌ఏ పోస్టుకు రూ.67,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.06.2024.
ALSO READ:
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 54 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైనవారికి భారీగా జీతం!
India Post Payments Bank Limited Recruitment: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి ఢిల్లీ, ముంబయి, చెన్నైలలో పోస్టింగ్ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (2)-2024 నోటిఫికేషన్ వెల్లడి, 404 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (II)- 2024 నోటిఫికేషన్ మే 15న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో దాదాపు 404 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2024, సెప్టెంబరు 1న రాతపరీక్ష నిర్వహించనుంది. శిక్షణతోపాటు త్రివిధ దళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 15 నుంచి, జూన్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..