News
News
X

ITBP Constable Recruitment: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

పదోతరగతి లేదా గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు లేదా 2సంవత్సరాల డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

FOLLOW US: 
Share:

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల పని అనుభవం. గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు లేదా 2సంవత్సరాల డిప్లొమా(ఐటిఐ) సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబరు23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 287 పోస్టులు 

విభాగాలు..

1. టైలర్: 18 

2. గార్డెనర్: 16 

3. కోబ్లర్: 31

4. సఫాయి, కరంచారి: 78 

5. వాషర్‌మాన్: 89

6. బార్బర్: 55

➽ కానిస్టేబుల్(టైలర్, గార్డెనర్, కోబ్లర్) 

అర్హత: పదోతరగతి లేదా సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల పని అనుభవం లేదా గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2సంవత్సరాల డిప్లొమా(ఐటిఐ) సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 22.12.2022 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

➽ కానిస్టేబుల్(సఫాయి కరంచారి, వాషర్‌మాన్, బార్బర్)

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల లేదా సంస్థ నుంచి పదవతరగతి కలిగి ఉండాలి.

వయోపరిమితి: 22.12.2022 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

పేస్కేలు: నెలకు రూ.21,700 - రూ.69,100.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

✪ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.11.2022.

✪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.12.2022.

Notification 

Website 

Also Read:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ - 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోను కూడా మంత్రి జతచేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 800 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు
న్యూఢిల్లీ ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...

ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 25 Nov 2022 08:42 PM (IST) Tags: ITBP Recruitment 2022 ITBP Constable Posts ITBP Constable Recruitment

సంబంధిత కథనాలు

TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!

TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

NITK Recruitment: నిట్‌-కురుక్షేత్రలో నాన్‌-టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

NITK Recruitment: నిట్‌-కురుక్షేత్రలో నాన్‌-టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

టాప్ స్టోరీస్

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Hanuma Vihari: శెబ్బాష్‌ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్‌ చేశాడు!

Hanuma Vihari: శెబ్బాష్‌ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్‌ చేశాడు!