Army TGC: ఇంజినీరింగ్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Indian Army Recruitment: డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Indian Army Recruitment: డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుషులు మే 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు రెండు విడతల రాతపరీక్షలు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. పోస్టులకు ఎంపికైనవారికి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.
వివరాలు..
* 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
ఖాళీల సంఖ్య: 30.
విభాగాలవారీగా ఖాళీలు..
➥ సివిల్: 07
➥ కంప్యూటర్ సైన్స్: 07
➥ ఎలక్ట్రికల్ : 03
➥ ఎలక్ట్రానిక్స్: 04
➥ మెకానికల్: 07
➥ ఎంఐఎస్‌సీ ఇంజినీరింగ్ స్ట్రీమ్: 02
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎత్తు 157.5 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 20 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/స్టేజ్-2 రాతపరీక్షలు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ ప్రదేశం: ప్రయాగ్‌రాజ్ (ఉత్తర్ ప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), జలంధర్ (పంజాబ్) కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైఫండ్ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.56,100-1,77,500/- జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2024.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.05.2024.
* కోర్సు ప్రారంభం: జనవరి-2025.
ALSO READ:
ఈసీఐఎల్‌లో 81 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే!
ECIL Hyderabad Recruitment: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో వివిధ ఖాళీల భర్తీకి వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 81 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, టెక్నీషియన్, ట్రైనీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టుల ఆధారంగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..