Agnipath Results: ఆర్మీ 'అగ్నివీర్' రాతపరీక్ష ఫలితాలు విడుదల, తెలుగు రాష్ట్రాల మెరిట్ జాబితాలు ఇలా
Army Agniveer Results: ఆర్మీలో 'అగ్నివీర్' పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ మే 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
Indian Army Agniveer Result 2024: ఇండియన్ ఆర్మీలో 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాల కోసం ఏప్రిల్ 22న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో రీజియన్ల(ARO)వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహించి తుదిఎంపిక చేస్తారు.
ఎంపికైనవారిని అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో నియమిస్తారు. విధుల్లో చేరినవారు నాలుగేళ్ల కాలానికి ఆర్మీలో అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000, మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం. నాలుగేళ్లు సర్వీసు తర్వాత 'సేవా నిధి ప్యాకేజీ' కింద రూ.10.04 లక్షలు ఇస్తారు.
శారీరక ప్రమాణాలు: ఎత్తు: అగ్నివీర్ జీడీ/ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు 166 సెం.మీ, అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు 165 సెం.మీ, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు 162 సెం.మీ. ఉండాలి. ఇక ఛాతీ కొలత గాలి పీల్చినపుడు 5 సెం.మీ విస్తరణతో 77 సెం.మీ. ఉండాలి.
సికింద్రాబాద్ ఏఆర్వో ఫలితాల కోసం క్లిక్ చేయండి..
గుంటూరు ఏఆర్వో ఫలితాల కోసం క్లిక్ చేయండి..
విశాఖపట్నం ఏఆర్వో ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఫలితాల కోసం క్లిక్ చేయండి (అన్ని రీజియన్లు)..
వివరాలు..
* ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నియామకాలు (Agnveer Recruitment) - 2024
కేటగిరీలు:
➥ అగ్నివీర్ జనరల్ డ్యూటీ
➥ అగ్నివీర్ టెక్నికల్
➥ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్ టెక్నికల్
➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్
➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్
టెక్నికల్ విభాగాలు: మెకానిక్ మోటార్ వెహికిల్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాట్స్‌మ్యాన్, సర్వేయర్, జియో ఇన్‌ఫర్మాటిక్స్ అసిస్టెంట్, ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఐటీ, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, వెసల్ నేవిగేటర్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఆటోమోబైల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ.
ఎంపిక విధానం: రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
జీతభత్యాలు: ఉద్యోగాలకు ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.33,000, మూడో ఏడాది నెలకు రూ.36,000, నాలుగో ఏడాది నెలకు రూ.40,000 చొప్పున ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం. నాలుగేళ్లు సర్వీసు తర్వాత 'సేవా నిధి ప్యాకేజీ' కింద రూ.10.04 లక్షలు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13.02.2024.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 22.03.2024.
➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22.04.2024.