అన్వేషించండి

AFCAT 2024 Application: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 'ఏఎఫ్‌క్యాట్' దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AFCAT 2024: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 02/2024 దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభమైంది. అవివాహిత స్త్రీ, పురుషులు జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Air Force Common Admission Test- AFCAT 2024 Application: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి 'ఏఎఫ్‌క్యాట్(AFCAT) 02/2024' నోటిఫికేషన్ ఇటీవల వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఎయిర్‌ఫోర్స్‌లో టెక్నిక‌ల్, నాన్ టెక్నిక‌ల్‌ విభాగాల్లో 304 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి 2025 జులైలో కోర్సులు ప్రారంభంకానున్నాయి. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రారంభంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. 

వివరాలు..

* ఏఎఫ్‌క్యాట్ -  AFCAT -  02/2024 

పోస్టుల సంఖ్య: 304 పోస్టులు

1) ఫ్లయింగ్ బ్రాంచ్: 29 

2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 156 

విభాగం: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.

3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 119 

విభాగం: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ. 

4) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

విభాగం: ఫ్లయింగ్ బ్రాంచ్.

అర్హత‌లు..

➥ ఫ్లయింగ్ బ్రాంచ్ విభాగాలకు సంబంధించిన పోస్టులకు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ అర్హత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

➥ గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ విభాగాలకు సంబంధించిన పోస్టుల‌కు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌ (ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానిక‌ల్) విభాగాల్లో లేదా దాని అనుబంధ బ్రాంచీల్లో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంట‌ర్‌‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

➥ గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

➥ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష ద్వారా 10 శాతం సీట్లను, ఏఎఫ్‌క్యాట్-2023 పరీక్ష ద్వారా 10 శాతం సీట్లను కేటయిస్తారు. 

వయోపరిమితి (01.07.2025 నాటికి):

➥ ఫ్లయింగ్ బ్రాంచ్: 20 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.07.2001 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ ద్వారా కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందినవారికి 2 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అంటే వయసు 26 సంవత్సరాలలోపు ఉండాలి. 02.07.1999 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. 

➥ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్న్ / నాటెక్నికల్): 20 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1999 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. డెబిట్/ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

పేస్కేలు: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ.1,77,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. మిలిటరీ సర్వీస్ పేలో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి.

ముఖ్యమైన తేదీలు..

⏩ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.05.2024.

⏩ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.06.2024.

Notification
Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget