IITM: ఐఐటీఎం పూణెలో రిసెర్చ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియోలజీ రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.
IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియోలజీ రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, యూజీసీ నెట్, ఐకార్ నెట్, గేట్, జెస్ట్ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 30.
⏩ రిసెర్చ్ అసోసియేట్: 10 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ- 02, ఎస్టీ- 03, ఓబీసీ- 02, జనరల్- 03(ఇందులో పీడబ్ల్యూబీడీ- 02).
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ (మెటియోరాలజీ/అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ ఓషియానిక్ సైన్సెస్/ ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/ జియోఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ కెమిస్ట్రీ/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్/ జియాలజీ/ ఎర్త్ సైన్సెస్/ కంప్యూటర్ సైన్స్)/కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా సంబంధిత సబ్జెక్టులు అండ్ సంబంధిత రంగంలో సైన్స్ సైటేషన్ ఇండెక్స్ (SCI) జర్నల్‌లో కనీసం ఒక మొదటి రచయిత పరిశోధనా పత్రాన్ని కలిగి ఉండాలి.
స్కిల్స్: కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పైథాన్, ఫోర్ట్రాన్, సి++, ఆర్, NCL, షెల్ స్క్రిప్టింగ్, MATLAB సాఫ్ట్‌వేర్, CFD సాఫ్ట్‌వేర్‌లు, MET-TC, VSDB, AI/ML మొదలైనవి, లినక్స్/యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మొదలైన వాటితో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.04.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(నాన్-క్రీమీ-లేయర్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.
పదవీకాలం: 01 సంవత్సరం (పనితీరును బట్టి మరో 02 సంవత్సరాలు పొడిగించవచ్చు).
వేతనం: రూ.58,000.
⏩ రిసెర్చ్ ఫెలో: 20 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ- 02, ఎస్టీ- 02, ఓబీసీ- 08, ఈడబ్ల్యూఎస్- 01, జనరల్- 07(ఇందులో పీడబ్ల్యూబీడీ- 04).
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఫిజికల్ సైన్సెస్ [ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/ అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ మెటియోరాలజీ/ ఓషనోగ్రఫీ/ క్లైమేట్ సైన్స్/జియోఫిజిక్స్ విత్ మెటియరాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్/ ఎలక్ట్రానిక్స్ సంబంధిత సబ్జెక్టులు ఉన్నాయి] /కెమికల్ సైన్సెస్[కెమిస్ట్రీ/ఫిజికల్ కెమిస్ట్రీ/ ఇనార్గానిక్ కెమిస్ట్రీ/ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లను కలిగి ఉంటాయి]/ మ్యథమెటికల్ సైన్సెస్[మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత సబ్జెక్టులు ఉన్నాయి]) లేదా అట్మాస్ఫియరిక్/ఓషియానిక్ సైన్సెస్ లేదా సంబంధిత సబ్జెక్టులలో ఎంటెక్ లేదా ఇంజినీరింగ్‌లోని ఏదైనా బ్రాంచ్ నుంచి మాస్టర్స్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, యూజీసీ నెట్, ఐకార్ నెట్, గేట్, జెస్ట్ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి.
స్కిల్స్: కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఫోర్ట్రాన్, సి, పైథాన్ అండ్ లినక్స్, యూనిక్స్ , విండోస్ ప్లాట్‌ఫారమ్‌లలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.04.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(నాన్-క్రీమీ-లేయర్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.
పదవీకాలం: 04 సంవత్సరాలు (మొదటి రెండేళ్లలోపు లేదా సీఎస్‌ఐఆర్-యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థి పీహెచ్‌డీ కోసం నమోదు చేసుకోవాలి.)
వేతనం: రూ.37,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 04.03.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.04.2024.