అన్వేషించండి

IDBI Jobs: డిగ్రీ అర్హతతో 500 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం

IDBI Jobs: ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

IDBI Assistant Manager Posts: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఆధ్వర్యంలోని ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఈ పోస్టుల‌ను ఐడీబీఐ భ‌ర్తీ చేయ‌నుంది.

ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.

జోన్లు: అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, నాగ్‌పుర్, పుణె, భువనేశ్వర్, పట్నా, చండీగఢ్, దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ.

వివరాలు..

* జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ): 500 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: యూఆర్‌- 203, ఎస్సీ- 75, ఎస్టీ- 37, ఈడబ్ల్యూఎస్‌- 50, ఓబీసీ- 135.

అర్హత‌: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.01.2024 నాటికి 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు వయోసడలింపు వర్తిస్తుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

రాత ప‌రీక్ష విధానం: మొత్తం 200 మార్కుల‌కు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నాలుగు విభాగాలుంటాయి. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి 60- ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్-40 ప్రశ్నలు-40 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్-60 ప్రశ్నలు- 60 మార్కులు అంశాల‌ నుంచి మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. ప‌రీక్షలో రుణాత్మక మార్కులుంటాయి.  తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. 

శిక్షణ, ఫీజు వివ‌రాలు: ఎంపికైన అభ్యర్థుల‌ను ఏడాదిపాటు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సులో చేరుస్తారు. ఆ స‌మ‌యంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా విడ‌త‌ల వారీగా ఫీజు క‌ట్టే వెసులుబాటు ఉంది. అర్హుత గ‌ల అభ్యర్థుల‌కు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేట‌ప్పుడు అభ్యర్థులు మూడేళ్లు స‌ర్వీస్ బాండ్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌. 

జీతభ‌త్యాలు: ఎంపికైన అభ్యర్థుల‌కు శిక్షణ కాలం (6 నెల‌లు)లో నెల‌కు రూ.5000 ఇస్తారు. ఇంట‌ర్న్‌షిప్ (2 నెల‌లు) స‌మ‌యంలో నెల‌కు రూ.15 వేలు చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన‌వారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వ‌ర‌కు వార్షిక వేతనం అందుతుంది. 

ముఖ్య తేదీలు...

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12.02.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26.02.2024.

* ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26.02.2024.

* ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 17.03.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget