అన్వేషించండి

IDBI Jobs: డిగ్రీ అర్హతతో 650 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం

ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది.

IDBI Junior Assistant Manager Posts: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఆధ్వర్యంలోని ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 650 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఈ పోస్టుల‌ను ఐడీబీఐ భ‌ర్తీ చేయ‌నుంది.

ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.

జోన్లు: అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, నాగ్‌పుర్, కొచ్చి, పూణె, భువనేశ్వర్, పాట్నా, చండీగఢ్, ఢిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ.

వివరాలు..

* జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ): 650 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: యూఆర్‌- 260, ఎస్సీ- 100, ఎస్టీ- 54, ఈడబ్ల్యూఎస్‌- 65, ఓబీసీ- 171.

అర్హత‌: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప్రావీణ్యం, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: 01.03.2025 నాటికి 21 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు వయోసడలింపు వర్తిస్తుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

రాత ప‌రీక్ష విధానం: మొత్తం 200 మార్కుల‌కు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నాలుగు విభాగాలుంటాయి. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి 60- ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్-40 ప్రశ్నలు-40 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్-60 ప్రశ్నలు- 60 మార్కులు అంశాల‌ నుంచి మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. ప‌రీక్షలో రుణాత్మక మార్కులుంటాయి.  తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. 

శిక్షణ, ఫీజు వివ‌రాలు: ఎంపికైన అభ్యర్థుల‌ను ఏడాదిపాటు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సులో చేరుస్తారు. ఆ స‌మ‌యంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా విడ‌త‌ల వారీగా ఫీజు క‌ట్టే వెసులుబాటు ఉంది. అర్హుత గ‌ల అభ్యర్థుల‌కు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేట‌ప్పుడు అభ్యర్థులు మూడేళ్లు స‌ర్వీస్ బాండ్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌. 

జీతభ‌త్యాలు: ఎంపికైన అభ్యర్థుల‌కు శిక్షణ కాలం (6 నెల‌లు)లో నెల‌కు రూ.5000 ఇస్తారు. ఇంట‌ర్న్‌షిప్ (2 నెల‌లు) స‌మ‌యంలో నెల‌కు రూ.15 వేలు చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన‌వారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వ‌ర‌కు వార్షిక వేతనం అందుతుంది. 

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.03.2025.

* ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 12.03.2025.

* ఫీజు చెల్లింపుjకు చివరి తేదీ: 12.03.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget