ICMR: ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ICMR Recruitment: న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ICMR Recruitment: న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 08 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 08
⏩ టెక్నికల్ ఆఫీసర్ 'బి': 01 పోస్టు
➥ విభాగం: బయో-మెడికల్ ఇంజినీరింగ్: 01
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
అనుభవం: 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ టెక్నికల్ ఆఫీసర్ 'సి': 07 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ సివిల్ ఇంజినీరింగ్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్ సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు.
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు.
➥ కంప్యూటర్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్ కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు.
➥ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్ కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు.
➥ ప్రోగ్రామర్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్ కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు.
➥ మెకానికల్ / మెకాట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 02
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్ మెకానికల్ / మెకాట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు టెక్నికల్ ఆఫీసర్ 'బి' పోస్టులకు రూ.56,100 - రూ.1,77,500; టెక్నికల్ ఆఫీసర్ 'సి' పోస్టులకు రూ.67,700 - రూ.2,08,700.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/వుమెన్/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
చెల్లింపు మోడ్: దరఖాస్తు ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డ్/నెట్‌బ్యాంకింగ్ ఉపయోగించి అప్లికేషన్ పోర్టల్‌లో డిపాజిట్ చేయడానికి ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే అందుబాటులో ఉంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్షవిధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT)- 80 మార్కులు & ఇంటర్వ్యూ- 20 మార్కులు కెటాయించారు. సీబీటీలో 80 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నలు ఉంటాయు. ఇందులో భాగంగా 60 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్ట్/ట్రేడ్‌కు సంబంధించినవి అడుగుతారు, 20 ప్రశ్నలు కంప్యూటర్ స్కిల్స్, జనరల్ సైంటిఫిక్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, బయోమెడికల్ సైన్సెస్, కామన్ సెన్స్, అనలిటికల్ స్కిల్స్, స్టాటిస్టిక్స్, జనరల్ అవేర్నెస్ నుంచి ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మేరకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష సమయం: 80 నిమిషాలు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.03.2024.