అన్వేషించండి

IBPS SO Notification: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 896 పోస్టులు భర్తీకి దరఖాస్తు ప్రారంభం

IBPS SO Notification: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 896 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

IBPS Specialist Officers Recruitment Notification 2025-26: దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) నోటిఫికేషన్ (CRP SCL-XIV) విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 896 పోస్టులు

1)  ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 170 పోస్టులు
అర్హత: బీటెక్/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్).

2) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 346 పోస్టులు
అర్హత: డిగ్రీ (అగ్రికల్చర్ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసికల్చర్/అగ్రి మార్కెటింగ్ & కోఆపరేషన్/ కో-ఆపరేషన్ &బ్యాంకింగ్/ ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్)

3) రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 25 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ (హిందీ/ సంస్కృతం). డిగ్రీ స్థాయిలో హిందీ/ సంస్కృతం తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి.

4) లా ఆఫీసర్ (స్కేల్-1): 125 పోస్టులు
అర్హత: లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) ఉండాలి. 

5) హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 25 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్/ హెచ్‌ఆర్‌‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా).

6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 205 పోస్టులు
అర్హత: డిగ్రీతోపాటు రెండేళ్ల ఎంఎంఎస్ (మార్కెటింగ్)/ ఎంబీఏ(మార్కెటింగ్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం.

వయోపరిమితి: 01.08.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1994 - 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి.  నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:  ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

IBPS Jobs: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 710 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!IBPS Jobs: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 710 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
తెలంగాణలో హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్; ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.

➥ ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: అక్టోబరు, 2024

➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబరు, 2024.

➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: నవంబరు/డిసెంబరు 2024.

➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: డిసెంబరు, 2024.

➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబరు, 2024.

➥ మెయిన్ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి/ ఫిబ్రవరి, 2025.

➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2025.

➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget