News
News
వీడియోలు ఆటలు
X

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఏప్రిల్ 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్  వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా క్లర్క్ నియామక ప్రధాన పరీక్షలను గతేడాది అక్టోబర్‌లో ఐబీపీఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు డౌన్‌లోడ్ చేయడం ఎలా?
 
➥ IBPS అధికారిక వెబ్‌సైట్‌ ibps.in పై క్లిక్ చేయండి.

➥ అక్కడ హోంపేజీలో 'CRP-క్లర్క్స్-XII' ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి. మీ స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.

➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్, పాస్‌వర్డ్ / పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. 

➥ IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితం స్క్రీన్‌పై వస్తుంది. డౌన్‌లోడ్ చేయండి.

➥  భవిష్యత్ అవసరాల కోసం ఫలితాన్ని ప్రింటౌట్ తీసుకోండి.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఏప్రిల్ 1న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా గతేడాది డిసెంబరులో ప్రిలిమ్స్, జనవరిలో మెయిన్స్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించింది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలను ఐబీపీఎస్ ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇలా!
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్ఎల్) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో పర్మనెంట్ నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను; తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 15గా నిర్ణయించారు.
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 02 Apr 2023 01:06 PM (IST) Tags: IBPS Institute of Banking Personnel Selection IBPS CRP-Clerks-XII Result 2023 ibps crp-clerks-xii result crp-clerks-xii

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!