అన్వేషించండి

AP DSC 2025: ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఎలా చెప్పాలి? | పూర్తి గైడ్, ముఖ్యమైన తేదీలు & తాజా అప్‌డేట్స్!

AP DSC 2025:ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరిక్షలు రెండో తేదీతో ముగిశాయి. ప్రాథమిక కీని అధికారులు సైట్‌లో పెడుతున్నారు. వాటిపై అభ్యంతరాలు ఎలా చెప్పాలో తెలుసుకుందాం.

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ(Andhra Pradesh DSC 2025) పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. వాస్తవంగా జూన్ 30నే పరీక్షలు ముగియాల్సి ఉన్నప్పటికీ జూన్‌ 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను జులై 1,2 తేదీలకు పోస్టు పోన్ చేశారు. ఆ రెండు పరీక్షలను కూడా విజయవతంగా పూర్తి చేయడంతో మెగా డీఎస్సీ పరీక్ష దశ ముగిసిందని విద్యాశాఖ ప్రకటించింది. 

ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్ వస్తే దాదాపు నెల రోజులు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి 15 రోజుల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ మెగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 తేదీన మొదలు పెట్టారు.  23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. రెండు సెషన్స్‌లో పరీక్షలు జరిపారు. 

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 92.90 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్షల కోసం ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పరీక్షలు పూర్తి అయినట్టు విద్యాశాఖ ప్రకటించింది. 

ఫలితాలు ఎప్పుడు?(AP DSC results 2025)
డీఎస్సీ నోటిఫికేషన్ టైంలోనే ఫలితాలలు ఆగస్టులో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్సర్‌ కీని విడుదల చేస్తున్నారు. వాటిపై అభ్యంతరాలు కూడా తెలియజేయవచ్చు. 

ఆన్సర్ కీపై అభ్యంతరాలు చెప్పొచ్చు(AP DSC Answer Key)
డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తూనే ఆన్సర్ కీని కూడా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు 30 ప్రశ్నాపత్రాల ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేశారు. వాటిపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఇవాళ రేపు మిగతా పేపర్ల కీలను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. 

ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఎలా చెప్పాలి?

  • ముందుగా మీరు డీఎస్సీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/ ను సందర్శించండి. 
  • అక్కడ కుడిచేతివైపు క్యాండిడేట్‌ లాగిన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి 
  • అలా క్లిక్ చేసిన తర్వాత మీకు వేరే పాపప్‌ ఓపెన్ అవుతుంది. అందులో మీ హాల్‌టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్‌, క్యాప్చా ఎంటర్ చేయండి 
  • తర్వాత సబ్‌మిట్ బటన్ ప్రెస్‌ చేస్తే మీరు మీ వ్యక్తిగత పేజ్‌లోకి ఎంటర్ అవుతారు. 
  • అందులో సర్వీసెస్‌ అని ఎడమ చేతివైపు ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి 
  • అక్కడ్ మీకు రెస్పాన్స్‌ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 
  • దానిపై క్లిక్ చేస్తే మీరు రాసిన పరీక్ష పత్రాలు వరుసగా కనిపిస్తాయి.
  • ఆ పరీక్ష పత్రాలకు ఎదురుగానే వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 
  • అలా వ్యూపై క్లిక్ చేస్తే మీరు పరీక్షలో నింపిన పరీక్ష పత్రం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
  • ఈ పరీక్ష పత్రంలో ప్రశ్నకు సంబంధించిన కీని మీరు చూస్తారు. అందులేనే కుడిచేతివైపు పై భాగంలో మీరు ఎంచుకున్న ఆప్షన్‌ కూడా చూడొచ్చు. 
  • ప్రభుత్వం విడుదల చేసిన కీలో తప్పులు ఉంటే వాటిపై అభ్యంతరం చెప్పేందుకు ఎడమ చేతివైపు అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మీకు Objections Entry ఫామ్ కనిపిస్తుంది. 
  • అందులో మీరు అభ్యంతరం చెప్పాలన్న క్వశ్చన్ పేపర్‌ను ఎంచుకోవాలి. 
  • తర్వాత పక్కనే క్వశ్చన్ ఐడీని ఎంచుకోవాలి.(మీరు ప్రశ్నాపత్రాన్ని సరిగ్గా చూస్తే క్వశ్చన్ ఐడీ కుడిచేతివైపు పై భాగంలోఉంటుంది)
  • ఆ క్వశ్చన్‌పై మీరు ఎలాంటి అభ్యంతరం చెప్పాలనుకుంటున్నారో కూడా పక్కనే ఆప్షన్స్‌ ఉంటాయి. అవి 
  1. తప్పుడు ప్రశ్న లేదా ప్రశ్నే గందరగోళంగా ఉంది
  2. ప్రశ్నలో ఇచ్చిన అన్ని ఆప్షన్స్‌ కరెక్ట్‌
  3. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్‌లు కరెక్ట్‌
  4. ఆన్సర్ కీలో ఇచ్చినది తప్పుడు సమాధానం
  5. ట్రాన్స్‌లేషన్ ఎర్రర్‌
  6. సిలబస్‌లో లేనిది ఇచ్చారు 
  7. పైన సూచిన వాటికి మించిన తప్పు ఉంది 

ఇలా అక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని అన్సర్ కీపై లేేదా ప్రశ్నాపత్రంపై మీ అభ్యంతరం చెప్పవచ్చు. 

తర్వాత మీరు చెప్పేదానికి కారణమేంటీ మీరు దేని ఆధారంగా ఇవి చెబుతున్నారో పక్కనే ఉన్న బాక్స్‌లో వివరంగా రాయాలి. 
ఇంకో ప్రశ్నకు మీరు అభ్యంతరం చెప్పాలంటే అక్కడే ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి.

మీరు అనుకున్న అభ్యంతరాలు చెప్పిన తర్వాత సబ్‌మిట్ బటన్ ప్రెస్‌ చేయాలి. వెంటనే మీకు ఒక కోడ్ వస్తుంది. 
ఇలా మీరు ఎన్ని ప్రశ్నలకు, జవాబులకైనా అభ్యంతరం చెప్పవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Embed widget