HVF: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 214 అప్రెంటిస్ పోస్టులు- వివరాలు ఇలా!
చెన్నై అవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఒక సంవత్సర కాలం పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు.
చెన్నై అవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఒక సంవత్సర కాలం పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 214.
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 104 ఖాళీలు
- మెకానికల్ ఇంజినీరింగ్: 50
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 10
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 19
- సివిల్ ఇంజినీరింగ్: 15
- ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 10
2. టెక్నికల్(డిప్లొమా) అప్రెంటిస్: 110 ఖాళీలు
- మెకానికల్ ఇంజినీరింగ్: 50
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 30
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 07
- సివిల్ ఇంజినీరింగ్: 05
- ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 18
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ సెప్టెంబర్ 2020, 2021, 2022లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.9000. టెక్నికల్(డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులకు రూ.8000.
ముఖ్యమైన తేదీలు..
➥ ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 01.05.2023.
➥ హెచ్‌వీఎఫ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 12.05.2023.
➥ షార్ట్‌లిస్ట్ చేసిన జాబితా వెల్లడి: 19.05.2023.
➥ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు: 29.05.2023, 30.05.2023&31.05.2023.
Also Read:
పాట్నా నిట్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు- అర్హతలివే!
పాట్నాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రింట్ అవుట్‌తో పాటు సంబంధిత పత్రాలను మే 25 వరకు సంబంధిత చిరునామాకు పంపించాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వైఎస్సార్ జిల్లాలో 56 అంగన్‌వాడీ పోస్టులు-అర్హతలివే!
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 03 వరకు సంబంధిత చిరునామాలో ఆఫ్‌లైన్ ద్వారా అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎస్‌బీఐలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు- వివరాలు ఇలా!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 217 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.