WDCW: వైఎస్సార్ జిల్లాలో 56 అంగన్‌వాడీ పోస్టులు-అర్హతలివే!
మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 03 వరకు సంబంధిత చిరునామాలో ఆఫ్‌లైన్ ద్వారా అందచేయాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 56
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: కడప, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్.
పోస్టుల వారీగా ఖాళీలు..
1. అంగన్‌వాడీ వర్కర్: 12 పోస్టులు
2. అంగన్‌వాడీ హెల్పర్: 40 పోస్టులు
3. మినీ అంగన్‌వాడీ వర్కర్: 04 పోస్టులు
అర్హత: 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం చిరునామాకు పంపాలి.
ఎంపిక ప్రక్రియ: నిబంధనల మేరకు.
జీతం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తుకు చివరి తేదీ: 03.05.2023.
➥ ఇంటర్వ్యూ తేదీ: 09.05.2023.
Also Read:
షార్ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు- అర్హతలివే!
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ కేటగిరీ/ విభాగాల్లో టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్/డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల తేదీలు ఖరారు, ఏ పరీక్ష ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఖరారు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 27న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రకటించిన తేదీల ప్రకారం ఆగస్టు 2 నుంచి 22 వరకు సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షలను, సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు ఎంటీఎస్ పరీక్షలను, అక్టోబర్ 3 నుంచి 6 వరకు ఎస్‌ఐ(ఢిల్లీ పోలీస్) పరీక్షలను నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..