News
News
వీడియోలు ఆటలు
X

Gurukula OTR: గురుకుల ఉద్యోగార్థులకు 'ఓటీఆర్‌' కష్టాలు ! విద్యార్హతల నమోదులో సమస్యలు!

గత నియామకాల్లో పాటించిన విద్యార్హతల నిబంధనలే అమలు చేస్తున్నామని బోర్డువర్గాలు స్పష్టం చేసినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. 

FOLLOW US: 
Share:

తెలంగాణలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 12 నుంచి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఓటీఆర్ చేసుకునే అభ్యర్థులకు టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్హతల నమోదులో మార్కుల పర్సంటేజీ పేరిట అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత నియామకాల్లో పాటించిన విద్యార్హతల నిబంధనలే అమలు చేస్తున్నామని బోర్డువర్గాలు స్పష్టం చేసినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. 

గురుకుల నియామక బోర్డు 9231 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు ఓటీఆర్ పద్ధతి ప్రవేశపెట్టింది. అయితే విద్యార్హతలకు సంబంధించి పీజీ డిగ్రీలో 55 శాతం కంటే తక్కువ మార్కులు ఉంటే ఓటీఆర్‌లో నమోదు కాకపోవడంపై ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

డిగ్రీ లెక్చరర్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు పీజీలో 55 శాతం, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉండాలి. మార్కుల శాతం ఎంత? సంబంధిత పోస్టుకు అర్హులా? కాదా? అనే విషయం ఆ పోస్టుకు దరఖాస్తు సమయంలో వెల్లడవుతుంది. కానీ ఓటీఆర్ నమోదులోనే ఇబ్బందులు తలెత్తడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓటీఆర్‌ నమోదుతో కేటాయించే నంబరుతో నోటిఫికేషన్ల వారీగా అర్హత కలిగిన గురుకుల పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. ఈ సదుపాయాన్ని గురుకుల నియామక బోర్డు ఏప్రిల్‌ 12 నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఓటీఆర్‌ నమోదు చేస్తేనే గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈమేరకు ఓటీఆర్‌ నమోదుకు సంబంధించిన వెబ్‌లింక్‌ను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 

ఓటీఆర్‌ నమోదు కోసం తొలుత ఆధార్‌ నంబరు నమోదు చేయాలి. ఆ తరువాత వ్యక్తిగత వివరాలు పూర్తిచేయాలి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 వరకు చదివిన జిల్లాను నమోదు చేయాలి. అనంతరం ఓటీఆర్‌ పూర్తవుతుంది. తరువాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు దరఖాస్తు చేసేందుకు వీలు కలుగుతుంది. ఓటీఆర్‌ నమోదు తరువాత యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సహాయంతో లాగిన్‌ అయి.. అర్హత కలిగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పరీక్ష ఫీజు చెల్లించి, మిగతా వివరాలు నమోదు చేస్తే దరఖాస్తు పూర్తవుతుంది. ఓటీఆర్‌ నమోదు చేస్తేనే  పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కువ సమయం వేచిచూడకుండా వెంటనే ఓటీఆర్‌ నమోదు పూర్తిచేయాలని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.

Website

అందుకే ఓటీఆర్ విధానం... 
ఉపాధ్యాయ బోధన విద్యార్హత కలిగిన అభ్యర్థులకు తాము చదివిన డిగ్రీ, పీజీ కోర్సుల మేరకు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు బోధించేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపోస్టుకు దరఖాస్తు చేసేందుకు వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి రావడం, తప్పులు దొర్లితే సవరణలకు బోర్డు కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడం లాంటి సమస్యల్ని అధిగమించడానికి.. దరఖాస్తు ప్రక్రియను సరళం చేసేందుకు బోర్డు ఓటీఆర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఓటీఆర్‌లో రిజిస్టరు అయిన తరువాత రిజిస్ట్రేషన్‌ నంబరుతో విద్యార్హతల మేరకు బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్లలో సబ్జెక్టుల వారీగా నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది.

దరఖాస్తు తేదీలివే..
గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.  గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక  గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. 

పోస్టులవారీగా నోటిఫికేషన్లు, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

Published at : 16 Apr 2023 03:04 PM (IST) Tags: TS Gurukula Recruitment Telangana Teacher Jobs TS Gurukula Notification TS Gurukula Job Notification TS Gurukula Jobs OTR Process OTR for Gurukula Jobs

సంబంధిత కథనాలు

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

టాప్ స్టోరీస్

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?