అంగన్‌వాడీల్లో 243 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీ!
ఏపీలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి ఏప్రిల్ 3న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అనుమితించిన పోస్టుల్లో సూపర్ వైజర్(గ్రేడ్-1) పోస్టులు-161, సీడీపీవో/ఏసీడీపీవో/రీజినల్ వేర్‌హౌస్ మేనేజర్ పోస్టులు- 61, బాలల గృహాల్లోని సూపరింటెండెంట్ పోస్టులు-21 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు ఇలా..
➥ సూపర్ వైజర్(గ్రేడ్-1) - 161 పోస్టులు,
➥ సీడీపీవో/ఏసీడీపీవో/రీజినల్ వేర్‌హౌస్ మేనేజర్ - 61 పోస్టులు,
➥ బాలల గృహాల్లోని సూపరింటెండెంట్ - 21 పోస్టులు
Also Read:
ఏప్రిల్ 10 నుంచి కోర్టు ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్! పోస్టులవారీగా షెడ్యూలు ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షల ఫలితాలను మార్చి 29న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. నియామక ప్రక్రియలో భాగంగా నాన్ టెక్నికల్ విభాగాల్లోని ఉద్యోగాలకు ఏప్రిల్ 10 నుంచి 24 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అభ్యర్థులకు సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులున్నందున ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల నుంచి ఖాళీలను అనుసరించి నిర్ణీత సమయంలో రెండో ఎంపిక జాబితా వెలువడనుంది. తదుపరి ఖాళీలను బట్టి అవసరమైతే, మూడో ఎంపిక జాబితా కూడా ప్రకటిస్తారు. టెక్నికల్ విభాగంలోని స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
పోస్టుల వారీగా షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఖరారు చేసింది. పరీక్షను జూన్ 5న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 25న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుం మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును పరీక్షకు కొన్నివారాలకు ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..